Graphic Arts
-
ప్రముఖ చిత్రకారుడు సతీశ్ గుజ్రాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు, శిల్పి సతీశ్ గుజ్రాల్ (94) కన్నుమూశారు. మాజీ ప్రధాన మంత్రి ఐకే గుజ్రాల్‌కు ఈయన సోదరుడు. వయోభారం రీత్యా గురువారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యుడు, రాజ్యసభ ఎంపీ నరేశ్ గుజ్రాల్ తెలిపారు. సతీశ్ నైపుణ్యం కలిగిన చిత్రకారుడు, శిల్పి, గ్రాఫిక్ ఆర్టిస్ట్ అంతేగాక దేశంలో రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషన్‌ను పొందిన వ్యక్తి. ఆయన మృతిపై దేశ ప్రధాని సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సతీశ్ గుజ్రాల్‌కు ఉన్న అపారమైన జ్ఞానమే ఆయన్ను అంత ఎత్తుకు తీసుకెళ్లిందని, అయినప్పటికీ ఆయన ఎప్పుడూ తగ్గి ఉండేవారని మోదీ కొనియాడారు. కళలు, సాంస్కృతిక విభాగంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. -
బెడ్‌బాత్‌మోర్‌డాట్‌కామ్ చేతికి క్రూడ్ ఏరియా
ముంబై: ఆన్లైన్ హోమ్ డెకార్ స్టోర్ ‘బెడ్‌బాత్‌మోర్‌డాట్‌కామ్’ తాజాగా గ్రాఫిక్ ఆర్ట్స్ సంస్థ ‘క్రూడ్ ఏరియా’ను కొనుగోలు చేసింది. పూర్తిగా షేర్ల రూపంలో జరిగిన ఈ డీల్ కోసం ఎంత వెచ్చించినదీ కంపెనీ వెల్లడించలేదు. ఇకపై క్రూడ్ ఏరియా వ్యవస్థాపకులు సహా ఉద్యోగులంతా కూడా బెడ్బాత్మోర్డాట్కామ్లో భాగమవుతారని పేర్కొంది. డీల్ అనంతరం కూడా క్రూడ్ ఏరియా స్వతంత్ర సంస్థగా సర్వీసులు అందిస్తుందని వివరించింది. వెబ్చట్నీ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్రావు 2012లో క్రూడ్ ఏరియాను ప్రారంభించారు. మేక్మైట్రిప్ సహవ్యవస్థాపకుడు సచిన్ భాటియా ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఇందులో పెట్టుబడులు పెట్టారు. దేశ, విదేశ ఆర్టిస్టులు రూపొందించిన గ్రాఫిక్ ఆర్ట్.. క్రూడ్ ఏరియాలో లభ్యమవుతుంది.