నీకన్నా గొప్పెవరు?
గ్రేట్ కోట్స్
నీ కలల సౌధాలను నువ్వే నిర్మించుకో. లేకుంటే వేరెవరో వచ్చి వారి కలల సౌధాలను నీ చేత నిర్మించుకుంటారు. (ఫరా గ్రే, వ్యాపారవేత్త)
నాకు ‘నో’ చెప్పినవాళ్లందరికీ ధన్యవాదాలు. వాళ్లు అలా చెప్పడం మూలానే నాకై నేను చేయగలిగాను.
(ఆల్బర్ట్ ఐన్స్టీన్, భౌతికవేత్త)
ఎవరితోనూ పోల్చుకోకు. అలా చేస్తే నిన్ను నువ్వు అవమానపరచుకున్నట్లే
(బిల్ గేట్స్, సాఫ్ట్వేర్ దిగ్గజం)
నీ పనిని నువ్వు గొప్పగా చేయడానికి ఉన్న మార్గం ఒక్కటే. ఆ పనిని నువ్వు ప్రేమించడం. ఒకవేళ అలాంటి పని నీకు ఇప్పటికీ దొరకనట్లయితే దాని కోసం ప్రయత్నిస్తుండు. అంతే తప్ప, చేస్తున్న పనికే పరిమితమైపోకు.
(స్టీవ్ జాబ్స్, ఆపిల్ వ్యవస్థాపకులు)
ఒక మనిషి కోసమో, ఒక కారణం కోసమో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు కోరుకున్న మార్పు సంభవించదు. నువ్వు ఎదురు చూస్తుండే మనిషి, కారణం కూడా నువ్వే కావాలి.
(బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు)
నీ కలలు నిజం కావాలంటే ముందు నువ్వు కలలు కనాలి. (ఎ.పి.జె. అబ్దుల్ కలామ్, క్షిపణి శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి)
జీవితం అప్పగించిన బాధ్యతల్ని స్వీకరించు. నువ్వెక్కడికైతే వెళ్లాలని అనుకుంటున్నావో అక్కడికి నిన్ను తీసుకెళ్లగలిగేది నువ్వు మాత్రమే. వేరెవరో కాదు. (లెస్ బ్రౌన్, విశ్వవిఖ్యాత వక్త)