great ritual
-
మహాక్రతువులో దివ్యప్రబంధ విన్నపాలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ మహాక్రతువు శనివారం ఘనంగా జరిగింది. పది రోజులుగా నిర్వహిస్తున్న మహాక్రతువులో భాగంగా శనివారం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి.. అష్టాక్షరి, ద్వాదశాక్షరి, షడాక్షరి, శ్రీరామ తారక శ్రీమంత్ర పునశ్చరణ హోమం నిర్వహించారు. హోమంలో అగ్ని ప్రతిష్ఠ చేసి వేద దివ్య ప్రబంధాది పారాయణాలు చేసి చతుష్టానార్చనలు, వేదాది విన్నపాలు చేశారు. శ్రీరామాయణం నుంచి 20 సర్గలను శ్లోక హవనం చేశారు. అనంతరం నిత్య పూర్ణాహుతి, భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం గావించారు. -
భద్రాద్రిలో కొనసాగుతున్న మహాక్రతువు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలోని చిత్రకూట మండపంలో శ్రీరామ మహాక్రతువు వైభవోపేతంగా కొనసాగుతోంది. క్రతువులో భాగంగా అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీసీతారాముల ఉత్సవమూర్తులకు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. భక్త రామదాసు కాలంనాటి విగ్రహాలకు బంగారు కవచం వేయనున్న నేపథ్యంలో శ్రీరామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. వందేళ్లకోసారి స్వామివారి ఉత్సవమూర్తులకు బంగారు కవచం వేస్తున్న సందర్భంగా ఈ క్రతువు ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిలోభాగంగా చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణం 20 సర్గలను పఠించారు. తిరువారాధన, ప్రాబోధిక చతుద్వారార్చన, చతుస్థానార్చన, వేదాది విన్నపాలు చేశారు. శ్లోక హవనం గావించి.. నిత్య పూర్ణాహుతి ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
భద్రాద్రిలో వైభవంగా మహాక్రతువు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మహాక్రతువు వైభవంగా కొనసాగుతోంది. భక్తరామదాసు కాలం నాటి విగ్రహాలకు బంగారు కవచం వేయనున్న నేపథ్యంలో శ్రీరామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. వందేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులో భాగంగా చిత్రకూటమండపంలో శ్రీరామాయణ పారాయణం 20 సర్గలను పఠించారు. తిరువారాధన, ప్రాబోధిక చతుద్వారార్చన, చతుస్థానార్చన, వేదాది విన్నపాలు చేశారు. శ్లోక హవనం గావించి, నిత్య పూర్ణాహుతి ఇచ్చి బుధవారం నాటి కార్యక్రమానికి ముగింపు పలికారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.