భద్రాద్రిలో కొనసాగుతున్న మహాక్రతువు | srivari fest continue in badrachalam | Sakshi
Sakshi News home page

భద్రాద్రిలో కొనసాగుతున్న మహాక్రతువు

Published Fri, Feb 26 2016 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

భద్రాద్రిలో కొనసాగుతున్న మహాక్రతువు

భద్రాద్రిలో కొనసాగుతున్న మహాక్రతువు

భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలోని చిత్రకూట మండపంలో శ్రీరామ మహాక్రతువు వైభవోపేతంగా కొనసాగుతోంది. క్రతువులో భాగంగా  అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీసీతారాముల ఉత్సవమూర్తులకు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. భక్త రామదాసు కాలంనాటి విగ్రహాలకు బంగారు కవచం వేయనున్న నేపథ్యంలో శ్రీరామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. వందేళ్లకోసారి స్వామివారి ఉత్సవమూర్తులకు బంగారు కవచం వేస్తున్న సందర్భంగా ఈ క్రతువు ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిలోభాగంగా చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణం 20 సర్గలను పఠించారు. తిరువారాధన, ప్రాబోధిక చతుద్వారార్చన, చతుస్థానార్చన, వేదాది విన్నపాలు చేశారు. శ్లోక హవనం గావించి.. నిత్య పూర్ణాహుతి ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement