Rama temple
-
న్యూజెర్సీలో అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సంబరాలు
-
దేవ దేవం అయోధ్య రామ గానం
-
Live: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం
-
750KMలు స్కేటింగ్ చేసుకుంటూ అయోధ్యకు వచ్చిన బాలుడు
-
అయోధ్యలో తెలుగు వారి ఉచిత భోజనం..
-
కఠిన ఉపవాస దీక్షలో పీఎం మోడీ..
-
రామయ్య దర్శనం కోసం భక్త కోటి ఎదురుచూపులు
-
అయోధ్య ఆలయ నిర్మాణం
-
దారులన్నీ అయోధ్యవైపే..
-
అయోధ్య శ్రీరాముడికి ప్రాణం పోసిన శిల్పి అరుణ్ యోగిరాజ్
-
అయోధ్య రామమందిర నిర్మాణంలో అబ్బురపరిచే విశేషాలు
-
సీతారాముల కళ్యాణంలో వరపూజ
-
రాముడి గుడికట్టిన ముస్లిం సర్పంచ్
రఘునాథపాలెం: సర్పంచ్‌గా గెలిస్తే ఆలయం నిర్మిస్తానన్న హామీని తు.చ. తప్పకుండా అమలు చేసి చూపించిన ముస్లిం మైనార్టీ సర్పంచ్ గ్రామస్తుల మన్ననలు అందుకుంటున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడి దంపాడు సర్పంచ్‌గా ఎస్కే మీరా గతంలో ఓసారి గెలిచారు. రెండోసారి కూడా పోటీలోకి దిగిన ఆయన తనను గెలిపిస్తే గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని సొంత డబ్బుతో నిర్మి స్తానని ప్రకటించారు. అనుకున్నట్లుగానే గెలిచిన వెంటనే సర్పంచ్ మీరా రూ.25 లక్షలు సమకూర్చారు. మరో రూ.25 లక్షలు గ్రామస్తులు, దాతల నుంచి సేకరించి గ్రామంలో శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కాగా, గురువారం విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరయ్యే భక్తులందరికీ అన్నదానం ఖర్చు కూడా మీరా భరించనుండటం మరో విశేషం. (క్లిక్: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. భారీ క్యూలు!) -
రామయ్య!.. ఆ అవతారంతో పాటే నడిసంద్రంలో మునిగిపోయాడా?
సాక్షి, వెబ్‌డెస్క్: రాముని పాదాల దగ్గర ఆయన పరమ భక్తుడు శ్రీ ఆంజనేయుడు కచ్చితంగా ఉండాల్సిందే!. అలాంటిది ఆ ఆలయంలో మాత్రం ఉండడు!. తెలంగాణ మెదక్ జిల్లా గుమ్మడిదలలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని ‘కళ్యాణ రాముడ’ని పిలుస్తారు. సీతారామకళ్యాణ ఘట్టం సమయానికి.. శ్రీ రామాంజనేయులకు పరిచయం లేదు. కాబట్టే ఇక్కడ మారుతి విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఉండకపోవచ్చనీ ఆలయ వర్గాలు చెప్తున్నాయి. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆలయం ఇది. 45 ఏళ్ల కిందట ఆలయాన్ని పునరుద్ధరించారు. సీతాసమేతుడైన శ్రీరామునితోపాటు లక్ష్మణుడు- ఊర్మిళ, భరతుడు-మాండవి, శత్రుఘ్నుడు-శ్రుతకీర్తిల విగ్రహాలు గర్భగుడిలో కనిపించడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. ఇక్కడ శ్రీరాముడు మీసాలతో కనిపిస్తుంటాడు. అందుకే ఇలాంటి అరుదైన దర్శనం మరెక్కడా దొరకదు. -------- ► తమిళనాడులోని అతిపెద్ద రామాలయాల్లో ఒకటి తిరువణ్ణమలై జిల్లాలోని నెడుంగుణమ్ శ్రీ రామ టెంపుల్. ఈ గుడిలో రాములోరి చేతిలో బాణం ఉండదు. గుండెపై కుడి చేయి వేసుకుని యోగముద్రతో శాంతమూర్తిగా కనిపిస్తాడు ఇక్కడ. ప్రశాంతతకు నెలవుగా ఈ ఆలయాన్ని భావిస్తారు భక్తులు. హనుమంతుడి విగ్రహం శిష్యుడి స్థానంలో వేదాధ్యయనం చేస్తూనే.. స్వామి చెబుతున్నది వింటున్నట్లు కనిపిస్తుంది. లక్ష్మణుడు మాత్రం విల్లు ధరించి ఉంటాడు. ఇక సీతమ్మ కుడిచేతితో తామరపువ్వు పట్టుకొని, ఎడమచేతిని రాముని పాదాలవైపు చూపిస్తున్నట్లు ఉంటుంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు ఇక్కడ విడిది చేశాడని, శుక మహర్షిని దర్శించుకున్నాడని స్థలపురాణాలు చెబుతున్నాయి. విజయం సాధించి తిరిగి వచ్చిన వాడు కాబట్టి ఇక్కడి రాముడిని ‘విజయ రాఘవన్’ అని అంటారు. రాముడు యోగముద్రతో కనిపించే ఆలయాలు ఇంకా ఉన్నప్పటికీ.. వాటిల్లో బాగా పేరున్నది ఇదే. -------- ► సాధారణంగా సీతారాముల విగ్రహంలో సీతమ్మ రాముడికి ఎడమ వైపు ఉంటుంది. కానీ, తిరుపతి కోదండ రామాలయంలో మాత్రం కుడివైపున సీతమ్మ విగ్రహం, ఎడమవైపున లక్ష్మణుడి విగ్రహం ఉంటుంది. వైఖానస ఆగమ నియమాల ప్రకారం అమ్మవారు దక్షిణంగా ఉండాలట!. ఆ ప్రకారమే ఈ విగ్రహం కుడివైపు ఏర్పాటు చేయించినట్లు పండితులు చెబుతున్నారు. ఇలా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. తిరుపతి సిటీ సెంటర్లో ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్తూ, ఈ ప్రాంతంలో శ్రీరాముడు విశ్రమించాడని స్థల పురాణం. అంతేకాదు సీతను అన్వేషించే క్రమంలో ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉంది. -------- ► త్రిప్రాయర్ శ్రీ రామస్వామి టెంపుల్.. కేరళలోని త్రిస్సూర్‌లో తీవ్ర నది ఒడ్డున ఉంది. ఎక్కడా కనిపించనట్లుగా ఆ గుడిలో శ్రీరాముడు.. విష్ణుమూర్తి అవతారంతో కనిపిస్తాడు. ‘త్రిప్రా దేవర్’గా ప్రసిద్ధుడైన ఈ శ్రీరాముడికి నాలుగు భుజాలు ఉంటాయి. ఒక చేతిలో పాంచజన్యం (శంఖం), మరో చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో విల్లు, నాలుగో చేతిలో జపమాల ఉంటాయి. వీటిలో జపమాల బ్రహ్మకు సంకేతంగా భావిస్తారు. అలాగే శివుడికి సంబంధించిన లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందుకే త్రిమూర్తుల స్వరూపమైన ఆలయంగా త్రిప్రాయర్‌ని భావిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరామ విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడనీ, అవతారం ముగిశాక ద్వారకతో పాటు ఈ విగ్రహం కూడా సముద్రంలో మునిగిపోయిందనీ స్థల పురాణం చెబుతోంది. సముద్రంలో దొరికిన విగ్రహానికి మత్స్యకారులు ప్రతిష్ఠ జరిపారని చెప్తారు. -------- ఫొటోల్లో తప్పించి శ్రీరామ పట్టాభిషేకం తరహా విగ్రహాలు ఏ ఆలయంలో కనిపించవు.. ఒక్క తమిళనాడులో తప్ప. సేలంకు దగ్గర్లోని అయోధ్యాపట్నంలోని శ్రీ కోదండపాణి రామాలయం ఉంది. ఇక్కడి ఆలయంలో రాముడు పట్టాభిషేక భంగిమలో కనిపిస్తాడు. ఎడమ కాలిని కుడి తొడ మీద వేసుకొని దర్శనమిస్తాడు. ఎడమవైపు సీతాదేవి కూర్చొని ఉంటుంది. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా, సైన్యం సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చాడట. అయోధ్య పట్టాభిషేక ముహూర్తం ఆలస్యం అవుతుండడంతో.. ఈ ప్రాంతంలో పట్టాభిషేకం జరిపారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ఊరికి అయోధ్యపట్నం అని పేరొచ్చిందని భావిస్తుంటారు. ::శ్రీరామ నవమి సందర్భంగా.. -
‘ఆ భూమి నాకు ఇవ్వండి.. బంగారు ఇటుక ఇస్తాను’
న్యూఢిల్లీ: మొఘల్ వంశానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న ప్రిన్స్ హబీబుద్దీన్ తుసి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామ జన్మభూమికి నన్ను హక్కుదారుగా గుర్తించి.. ఆ భూమిని నాకు ఇవ్వండి. నేను అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తాను.. బంగారు ఇటుక ఇస్తానని ప్రకటించాడు. వివరాలు.. తుసి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చివరి మొఘల్ చక్రవర్తి బహుదూర్ షా జాఫర్ వారసుడిని. రామజన్మభూమిపై నాకే పూర్తిగా హక్కు ఉంది. మా వంశీకుడైన బాబర్ రామ మందిరాన్ని కూల్చి.. బాబ్రీ మసీదును నిర్మించాడు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారు ఎవరూ కూడా తామే ఆ భూమికి నిజమైన హక్కుదారులమని నిరూపించుకోలేకపోయారు’ అన్నాడు. ‘ఇప్పటికైనా సుప్రీం కోర్టు నన్ను నిజమైన హక్కుదారుగా గుర్తించి ఆ భూమిని నాకు అప్పగిస్తే మంచిది. ఆ భూమిని రామ మందిర నిర్మాణం కోసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మందిర నిర్మాణం కోసం బంగారు ఇటుక ఇస్తాను’ అన్నారు. తుసి ఇప్పటికే మూడు సార్లు అయోధ్యను దర్శించి ప్రార్థనలు చేశారు. గతేడాది అయోధ్యను దర్శించినప్పుడు రామ మందిరాన్ని కూల్చినందుకు గాను హిందువులకు క్షమాపణలు కూడా చెప్పారు. -
ఆధిపత్య పోరు.. ఆలయం కూల్చివేత
సాక్షి, సోమాపురం(కడప) : మండలంలోని సోమాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ వర్గీయులు గ్రామంలోని రామాలయాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పాత ఆలయాన్ని కూల్చి వేసి దాని స్థానంలో నూతన ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ మేరకు మూడేళ్ల క్రితం గ్రామస్తులు రూ.14లక్షల వరకు విరాళాలు సేకరించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కమిటీ ఏర్పడింది. టీటీడీ నుంచి ఆలయ నిర్మాణం కోసం నిధులు కూడా మంజూరయ్యాయి. మూడేళ్లుగా నూతన ఆలయ నిర్మాణం పేరుతో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు గ్రామంలో ఆలయ నిర్మాణంపై టీడీపీ నాయకులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో సమస్య తలెత్తగా, ఆలయ నిర్మాణం కమిటీలో మార్పులు జరగాలని గ్రామ ప్రజలందరికీ ఆమోదం ఉండాలని వైఎస్సార్సీపీ వర్గీయులు అభ్యంతరాలు తెలిపారు. ఎన్నికల అనంతరం గత వారం రోజుల నుంచి ఆలయ నిర్మాణం చేపట్టాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆలయ కమిటీ నిర్వాహకులు సమావేశం నిర్వహించారు. ఇందులో ఉన్న ఒకే ఒక్క వైఎస్సార్సీపీ వర్గీయుడైన పోలు వెంకటరామిరెడ్డి ఆలయ కమిటీలో మార్పులు చేసి ఇరు వర్గీయులకు ఆమోదయోగ్యంగా చర్యలు తీసుకోవాలని సూచించాడు. దీనికి టీడీపీ నాయకులు ససేమిరా అనటంతో సమావేశం అర్ధంతరగా ఆగిపోయింది. ఇంతలో ఆలయ నిర్మాణం తమ ప్రమేయంతోనే జరగాలనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గ్రామంలోని రామాలయాన్ని ట్రాక్టర్ల సాయంతో కూల్చివేశారు. కాగా కొత్త ఆలయాన్ని నిర్మించే యోచనలో మూడు నెలల క్రితమే ఆలయంలోని విగ్రహాన్ని తొలగించి తాత్కాలికంగా పక్కనే ప్రతిష్టించారు. ఇంతలోనే ఆలయాన్ని కూల్చివేయడంతో వైఎస్సార్సీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నరేంద్రకుమార్ దీనిపై మాట్లాడుతూ ఇరు వర్గీయులను కోర్టుకెళ్లాలని, కేసులు పెట్టాల్సి వస్తే ఇరువర్గాలపై పెట్టాల్సి వస్తుందని చెప్పటంతో సమస్య అలాగే ఉండిపోయింది. ఆలయం కూల్చిన సంఘటనకు సంబంధించి టీడీపీ వరీ ్గయులైన లెక్కల సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, అంకిరెడ్డిపల్లె చిన్న కొండారెడ్డి, మురళీమోహన్‌రెడ్డి,సుబ్బరామిరెడ్డి ఇంకా పలువురిపై పోలు వెంకటరామిరెడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
గురజాల రామాలయంలో చోరీ
గుంటూరు జిల్లా గురజాలలోని రాములవారి ఆలయంలో దొంగలు పడి అతి పురాతన ఉత్సవ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. రామాలయంలోని పంచలోహ నిర్మిత శ్రీరాముడు, సీత, లక్షణస్వామి వారి విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న రామాలయంలో సోమవారం ఉదయం పూజలు నిర్వహించడానికి వెళ్లిన భక్తులు ఈ విషయాన్ని గమనించి పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎత్తుకెళ్లిన విగ్రహాల విలువ సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంటున్నారు. -
భద్రాద్రిలో కొనసాగుతున్న మహాక్రతువు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలోని చిత్రకూట మండపంలో శ్రీరామ మహాక్రతువు వైభవోపేతంగా కొనసాగుతోంది. క్రతువులో భాగంగా అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీసీతారాముల ఉత్సవమూర్తులకు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. భక్త రామదాసు కాలంనాటి విగ్రహాలకు బంగారు కవచం వేయనున్న నేపథ్యంలో శ్రీరామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. వందేళ్లకోసారి స్వామివారి ఉత్సవమూర్తులకు బంగారు కవచం వేస్తున్న సందర్భంగా ఈ క్రతువు ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిలోభాగంగా చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణం 20 సర్గలను పఠించారు. తిరువారాధన, ప్రాబోధిక చతుద్వారార్చన, చతుస్థానార్చన, వేదాది విన్నపాలు చేశారు. శ్లోక హవనం గావించి.. నిత్య పూర్ణాహుతి ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
రామాలయంలో వెండి చోరీ
ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ పట్టణంలోని జంకాపూర్ రామాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలో ప్రవేశించిన దొంగలు స్వామి, అమ్మవార్ల వెండి కళ్లు, హుండీలో నగదు తస్కరించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు -
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి: స్వామి
న్యూఢిల్లీ: అయోధ్యలోని రావువుందిరాన్ని పునర్నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయుకుడు సుబ్రవుణ్య స్వామి ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. 2016లోగా ఆలయునిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయున కోరారు. ఈ మేరకు సుబ్రవుణ్యస్వామి ప్రధానికి లేఖ రాశారు. ఈ పనిని పూర్తిచేయుడానికి సుప్రీంకోర్టు వూజీ న్యాయువుూర్తిని నియుమించాలని సూచించారు. -
రామయ్య ఇక్కడ.. ఆస్తులు అక్కడ
ఆర్డినెన్స్‌తో దేవస్థానం భూములు ఆంధ్రలోకి.. రామాలయ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం భద్రాచలం : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రస్తుతం భద్రాచలం ప్రాంతమే చర్చనీయాంశమైంది. పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటమే ఇందుకు కారణం. ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా, నేడో రేపో దీనిపై వాడివేడిగా చర్చసాగనుంది. దీంతో పార్లమెంటు సాక్షిగా భద్రాచలం అంశమే హాట్‌టాపిక్‌గా మారింది. భద్రాచలం డివిజన్లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలను, పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలంలోని 6 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రామాలయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామా న్ని తెలంగాణకు ఉండేలా ఆర్డినెన్స్‌లో పొందుపరిచా రు. దీని వల్ల రామాలయానికి సంబంధించిన భూములు ఉన్న ప్రాంతమంతా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోతుంది. ఇది శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాభివృద్ధిపై ప్రభావం పడనుంది. భూములన్నీ ఆంధ్రలోనే.. భద్రాద్రి రామాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,250.67 ఎకరాల భూమి ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్ఛిమగోదావరి జిల్లాల్లో ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఒక్క ఖమ్మం జిల్లాలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్న 30.25 ఎకరాలు భూమి మినహా మిగతా భూమి అంతా ఆర్డినెన్స్‌తో ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్లిపోతుంది. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనర్సింహారావు పేట లో ఉన్న 20 ఎకరాలు, అశ్వాపురం మండలం నెల్లిపాకలో 6.25, ముల్కలపల్లి మండల కేంద్రంలో 4 ఎకరాలు మాత్రమే తెలంగాణలో ఉంటాయి. భద్రాచ లం మండలం పురుషోత్తపట్నంలోనే రామాలయాని కి 889.50 ఎకరాల భూమి ఉంది. ఇదే మండలంలోని పినపల్లి, మనుబోతుల చెరువు, చోడవరం, కాపవరం, రాచగొంపల్లి, బూర్గంపాడు మండలం సీతారామనగరంలో ఆలయ భూమలు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తున్నారు. దీంతో ముంపు మండలాలతో కలుపుకొని ఇతర జిల్లాలో ఉన్న 1220.42 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటుంది. ఈ మొత్తం భూములకు గాను కౌలు రూపేణా రూ.20 లక్షల ఆదాయం వస్తుండగా, వీటి విలువ రూ.కోట్లలోనే ఉంటుంది. రామయ్య భూములన్నీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటంతో భవిష్యత్‌లో వీటి ద్వారా ఆదాయం పొందేందుకు ఆ రాష్ట్రానికి చెందిన దేవాదాయశాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుం ది. ఈ కారణంగా అనేక ఇబ్బందులు ఉంటాయని ఆలయ అధికారులు ఉంటున్నారు. వసతి కేంద్రాలకు భూసమస్య... ఆర్డినెన్స్‌కు ఆమోదం లభిస్తే భద్రాచలం ఆలయాభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. భక్తులకు వసతి కోసం కాటేజీలు, సత్రాలు కట్టాలన్నా పట్టణానికి ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తున్న పురుషోత్తపట్నం భూముల్లోనే నిర్మించాల్సి ఉంటుంది. సెయింట్ ఆన్స్ పాఠశాలకు అనుకొని ఉన్న భూముల్లో కాటేజీల నిర్మాణం కోసం గతంలో దేవస్థానం పాలకమండలి కూడా తీర్మానిం చింది. రామాలయం వద్ద భవనాల నిర్మాణానికి తగి నంత స్థలం లేకపోవటంతో పురుషోత్తపట్నం భూముల్లోనే వసతి కేంద్రాలు నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ భూమిలో బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆర్డినెన్స్ అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇక ఐటీడీఏకు సమీపంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ట్రైబల్ హట్, రామాయణం థీమ్ పార్కు నిర్మిస్తున్న ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్‌లోకే వెళ్లిపోతుంది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల(సీతాకుటీరం)నకు వెళ్లే మార్గంలోని భద్రాచలం మండలంలో గల గ్రామాలను కూడా ఆర్డినెన్స్‌లో చేర్చటంతో సీతాకుటీరానికి భద్రాచలం మీదగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించాకే తగు నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.