మహాక్రతువులో దివ్యప్రబంధ విన్నపాలు | great ritual in Sri sitaramacandra Swamy Temple | Sakshi
Sakshi News home page

మహాక్రతువులో దివ్యప్రబంధ విన్నపాలు

Published Sun, Feb 28 2016 3:37 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM

మహాక్రతువులో దివ్యప్రబంధ విన్నపాలు - Sakshi

మహాక్రతువులో దివ్యప్రబంధ విన్నపాలు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ మహాక్రతువు శనివారం ఘనంగా జరిగింది. పది రోజులుగా నిర్వహిస్తున్న మహాక్రతువులో భాగంగా శనివారం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి.. అష్టాక్షరి, ద్వాదశాక్షరి, షడాక్షరి, శ్రీరామ తారక శ్రీమంత్ర పునశ్చరణ హోమం నిర్వహించారు. హోమంలో అగ్ని ప్రతిష్ఠ చేసి వేద దివ్య ప్రబంధాది పారాయణాలు చేసి చతుష్టానార్చనలు, వేదాది విన్నపాలు చేశారు. శ్రీరామాయణం నుంచి 20 సర్గలను  శ్లోక హవనం చేశారు. అనంతరం నిత్య పూర్ణాహుతి, భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం గావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement