The green signal
-
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- దూరవిద్య , రెగ్యులర్ బీఈడీ కోర్సులకు - అడ్హాక్ లెక్చరర్ల నియామకం - టైం స్కేలు ఉద్యోగులకు అద్దె భత్యం మంజూరు - పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు ఎస్కేయూ (అనంతపురం) : ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఎస్కేయూ పాలక మండలి ఆమోదం తెలిపింది. మంగళవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం జరిగింది. తొలిసారిగా వర్సిటీలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఏజెన్సీని అప్పగించే వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకుంది. కార్తికేయ ఏజెన్సీకి అప్పగించే ముందే పలు ఆరోపణలు రావడంతో మాజీ ఉపకులపతులతో కమిటీ వేశారు. కార్తికేయ ఏజెన్సీపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కాలేదని నివేదిక ఆధారంగా పాలకమండలి తుది ఆమోదం తెలిపింది. కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టుల భర్తీలో కార్తికేయ ఏజెన్సీ ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుననట్లు ప్రచారం జరగడంతో వాటి మినహా గార్డెనర్, స్క్రావెంజర్స్, డ్రైవర్స్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు పాలకమండలి సమ్మతించింది. త్వరలోనే కార్తికేయ ఏజెన్సీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. మరో వైపు సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన వెంగమాంబ ఏజెన్సీ ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము స్వాహా చేశారనే ఆరోపణలపై ప్రొఫెసర్ల కమిటీ వేసి, నిగ్గుతేల్చాలని పాలకమండలి తీర్మానించింది. అడ్హాక్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుమతి : దూరవిద్య బీఈడీ, రెగ్యులర్ బీఈడీ కోర్సుల్లో ఎన్సీటీఈ నిబంధనలకనుగుణంగా అడ్హాక్ లెక్చరర్లను నియమించాలనే ప్రతిపాదనకు అనుమతి లభించింది. ఏటా ఎ¯ŒSసీటీఈ అనుమతికి బోధన పోస్టుల భర్తీ లేకపోవడంతో అవరోధంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టైం స్కేలు ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం పెంపుదల చేశారు. రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రూ. 65లు, సప్లిమెంటరీ పరీక్షలకు ఒక్కో విద్యార్థికి రూ.15లు అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు చెల్లిస్తారు. ఎన్నికల సంఘానికి అనుమతి : ఎస్కేయూ రెక్టార్ ఆచార్య శ్రీధర్, రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ పదవీ కాలం జనవరి 3 నాటికి ముగిసింది. వచ్చే పాలకమండలి సమావేశం వరకు కొనసాగించా లని గత పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. అయితే మంగâýæవారం జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని పదవుల మార్పు అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పాలకమండలి సమా వేశానికి ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ సుబ్రమణ్యం, ఆచార్య ఎ. మల్లికార్జున రెడ్డి, ఆచార్య బి.ఫణీశ్వరరాజు, రామయ్య, డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, విజయారావు, నాగజ్మోతిర్మయి, రెక్టార్ ఆచార్య జి.శ్రీధర్, రిజిస్ట్రార్ ఆచార్య ఎ .వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
1,399 చెరువులకు మహర్దశ
వరంగల్ రూరల్ : తెలంగాణ సర్కారు చిన్న నీటి వనరులపై దృష్టి కేంద్రీకరించింది. చెరువులకు నిధులు కేటారుుంచి అభివృద్ధి పర్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టుకుని సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని చూస్తోంది. స్థానికంగా ఉండే చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవడంతో చిన్నపాటి వర్షానికే మత్తళ్లు పడుతున్నారుు. దీన్ని గమనించిన ప్రభుత్వం చెరువుల్లోని పూడికను తీస్తే నీటి నిల్వ సామర్థ్యంతోపాటు సమీప ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుందని భావిస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకుని ఒక్కో చెరువుకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలతో మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టనుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల శాఖ కింద 20 శాతం చెరువులను మొదటి విడతలో అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చెరువులను గుర్తించాలని నీటి పారుదల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించగా.... వారు పక్షం రోజులుగా సర్వే చేసి లెక్క తేల్చారు. మొదటి విడతలో.. ఇటీవల నీటి పారుదలశాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో జిల్లావ్యాప్తంగా 5,584 చిన్ననీటి వనరులు ఉన్నటు గుర్తించారు. ఎంపికలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన చెరువులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 20 శాతం అంటే 12 నియోజకవర్గాల్లో 1,399 చెరువులను అభివృద్ధి చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందించారు. వీటికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే... నిధుల ప్రతిపాదనలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సమీక్షించి నిధులు కేటాయించనున్నారు. ఈ చెరువుల పునరుద్ధరణకు ఏటా సుమారు రూ.400 కోట్లకు పైగా నిధులు వ్యయం చేయనున్నట్లు సమాచారం. కాగా, గొలుసు కట్టు చెరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్... ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. అదే విధానంతో చెరువులను అభివృద్ధి చేసే విధంగా అంచనాలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెరువుల అభివృద్ధి వివిధ పథకాల్లో విడుదలవుతున్న నిధులన్నింటినీ ఈ పథకంలో వ్యయం చేయనున్నారు. చెరువుల సామర్థ్యం పరిగణనలోకి తీసుకుని ఆయూ పథకాల్లో సిఫారసు చేయనున్నారు. కేంద్రం అందజేస్తున్న త్రిపుల్ఆర్, వరల్డ్‌బ్యాంక్, ఏఐబీపీ, ఏపీసీబీటీఎంపీ, ఎన్ఎస్పీ, ఎఫ్డీఆర్ వంటి పథకాల నిధులను వీటికి కేటాయించనున్నారు. సర్వే పూర్తయింది.. చెరువుల పునరుద్ధరణలో భాగంగా సర్వే పూర్తయింది. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సూచనలతో జిల్లావ్యాప్తంగా 20 శాతం చెరువులను ఎంపిక చేశాం. సర్వే పూర్తయినందున ప్రతిపాదనల రూపకల్పనల్లో అధికారులు ఉన్నారు. నిధులు కేటాయిస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. - వి.పద్మారావు, ఎస్ఈ, ఐబీ, వరంగల్