Grenada
-
అథ్లెట్‌పై అమానుష దాడి.. వీడియో వైరల్
జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ అండర్సన్ పీటర్స్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గ్రెనాడాలో ఓ బీచ్ పార్టీకి హాజరైన అండర్సన్ పీటర్స్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పడవలో నుంచి నీళ్లల్లోకి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే గొడవ ఎందుకు జరిగింది?దాడి ఎవరు చేశారు? ఏం జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా దాడిలో స్వల్పంగా గాయపడిన అండర్సన్ పీటర్స్, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు గ్రెనాడా పోలీసులు పేర్కొన్నారు. కాగా అండర్సన్ పీటర్స్‌పై దాడిని ఒలింపిక్ కమిటీ ఖండించింది. ‘పీటర్స్‌పై దాడి అమానుష చర్య. నేషనల్ స్పోర్ట్స్ స్టార్, హీరో అయిన అండర్సన్‌పై దాడి చేసిన ఐదుగురిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. అతనిపై దాడి చేసిన వాళ్లు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు కాదని తెలిసింది.’ అంటూ పేర్కొంది. గ్రేనడా దేశానికి చెందిన అండర్సన్ పీటర్స్.. 2019, 2022 జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్షిప్స్ టైటిల్స్ గెలిచాడు. ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో 93.07 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన అండర్సన్ పీటర్స్, ఆ తర్వాత స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. #AndersonPeters being beaten by five non-national in #Grenada pic.twitter.com/NrVBJwu2t9 — Do.Biblical.Justice. (@StGeorgesDBJ) August 11, 2022 -
గుండె జబ్బుల బాధితుల్లో కుంగుబాటు ముప్పు
డబ్లిన్: మనిషి శరీరానికి, మనసుకు సంబంధం ఉంటుందన్న సంగతి తెలిసిందే. శారీరక, మానసిక ఆరోగ్యానికి మధ్య గల సంబంధంపై పరిశోధకులు చాలాఏళ్లుగా లోతైన అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆరోగ్యకరమైన మనసు శారీరక ఆరోగ్యానికి సూచిక అని చెబుతున్నారు. అలాగే మనిషిలో కుంగుబాటు(డిప్రెషన్) అనేది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని గుర్తించారు. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే గుండె జబ్బులతో బాధిపడుతున్నవారిలో కుంగుబాటు అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు 55 నుంచి 75 ఏళ్లలోపు వయసున్న 6,500 మందిపై నిర్వహించిన ఈ నూతన అధ్యయనం ఫలితాలను ప్లోస్‌వన్ పత్రికలో ప్రచురించారు. ఆరోగ్యవంతుల్లో క్రమంగా డిప్రెషన్ లక్షణాలు బయటపడితే వారికి గుండెజబ్బుల ముప్పు పొంచి ఉన్నట్లేనని అధ్యయనంతో తేలింది. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతోపాటు కుంగుబాటు కూడా ఉంటే త్వరగా మరణించే అవకాశాలు పెరుగుతున్నట్లు వెల్లడయ్యింది. మనుషుల్లో కుంగుబాటును సృష్టించడంలో మెటబాలిక్ సిండ్రోమ్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధికంగా చక్కెర, నడుము చుట్టూ అధిక కొవ్వు, రక్తంలో అధికంగా చెడు కొలెస్టరాల్‌ను మెటబాలిక్ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. గుండె జబ్బులు, కుంగుబాటు నుంచి విముక్తి పొందాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి. రోజువారీ దినచర్యలో శారీరక వ్యాయామాన్ని ఒక భాగంగా మార్చుకోవాలి. -
అద్భుత అందాలకు నెలవు గ్రెనెడా
సాక్షి, న్యూఢిల్లీ : అందమైన పర్యతాలకు, అద్భుతమైన లోయలకు, వర్షాలకు కొదవలేని దట్టమైన అడువులకు నెలవు గ్రెనడా. ఆకర్షణీయమైన బీచ్‌లకు, వెండి వలె మెరిసే ఇసుక తిన్నెలకు, సుగంధ ద్రవ్యాలకు కొలవు గ్రెనడా, హొయలొలికించే సముద్ర తీరాలకు సమీపంలో కొలువైన ఆహ్లాదకర హాలిడే రిసార్ట్స్‌కు కొదవ లేదు. అన్ని హంగులు కలిగిన గ్రెనడాకు సాటి వచ్చే మరో కరేబియన్ దేశం లేదంటే నమ్మక తప్పదు. సుగంధ ద్రవ్యాల దీవిగా ఖ్యాతికెక్కిన గ్రెనడాకు అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జోక్యంతో, బ్రిటీష్ ప్రధాని మార్గరెట్ థాచర్ ప్రమేయంతో బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. గ్రెనడా రాజధాని నగరం సెయింట్ జార్జ్ విస్తీర్ణంలో బార్బొడోస్ అంత ఉన్నప్పటికీ జన సాంద్రత మాత్రం తక్కువే. బార్బొడోస్లో మూడు లక్షల మంది నివసిస్తుండా సెయింట్ జార్జ్ నగరంలో దాదాపు లక్ష మందే నివసిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోన్నా గ్రెనడా జాజికాయ ఎగుమతిలో ప్రపంచంలోనే రెండవ పెద్ద దేశం. ఫల పుష్పాలతోపాటు ప్రకృతి సిద్ధమైన జలపాతాలతో పర్యాటకులను ఆకర్షించే గ్రెనడాను చైసిన వారు ‘గాడ్ ఈజ్ గ్రెనేడియన్’ అనక మానరు. పామ్ ట్రీస్ ఎక్కువగా కనిపించే ఈ దీవిపైన విలాసవంతమైన అతిథులకు, వేసవి విడిదులకు కొరత లేదు. ఒక బ్రిటన్, అమెరికా దేశాల నుంచే రోజుకు దాదాపు 70 మంది పర్యాటకులు ఆదేశాన్ని సందర్శిస్తారు. ఈ రెండు దేశాలతోపాటు పలు దేశాల నుంచి గ్రెనడాకు ఇప్పుడు నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సమూహాల నుంచి సామాజిక దూరాన్ని కోరుకునే ప్రజలు పర్యాటకులుగా ఈ దేవిని ఎక్కువగా సందర్శిస్తున్నారు. వెండిలా మెరుస్తుండే ఇసుక బీచుల్లో పాద రక్షలు లేకుండా నడవడం మరచిపోలేని ఓ మధుర అనుభూతి. ఆరోగ్యంతోపాటు అహ్లాదాన్ని కలిగించే 101 మీటర్ల పొడవైన స్మిమ్మింగ్ ఫూల్ గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కరేబియన్ దీవుల్లో మరెక్కడా అంత పొడవైన స్విమ్మింగ్ పూల్ లేదు. ఎప్పుడూ నవ్వుతుండే స్థానిక ప్రజలను చూస్తుంటే వారి జీవితాలు ఎంత సంతృప్తిగా గడచి పోతున్నాయో అర్థం అవుతుంది. -
ఐర్లాండ్ ‘పవర్ ప్లే’ రికార్డు
గ్రెనడా: ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంలో టీ20 సిరీస్‌కు సిద్ధమైన వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో విండీస్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో చివరకు ఐర్లాండ్ విజయం సాధించగా, విండీస్ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(95; 47 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ కోల్పోగా, కెవిన్ ఒ బ్రయిన్(48; 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. (ఇక్కడ చదవండి: విండీస్ క్లీన్‌స్వీప్ ) ప్రధానంగా పాల్ స్టిర్లింగ్ బౌండరీల మోత మోగించి ఐర్లాండ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.ఆరో ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన స్టిర్లింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే 20 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరొకవైపు ఒబ్రయిన్ సైతం బ్యాట్ ఝుళిపించడంతో ఐర్లాండ్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. ఇది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పవర్ ప్లే స్కోరుగా లిఖించబడింది. పీర్రే వేసిన ఆరో ఓవర్లో 24 పరుగులు రాగా, అందులో 23 పరుగులు స్టిర్లింగ్ సాధించినవే కావడం విశేషం. ఇక మిగతా ఐర్లాండ్ ఆటగాళ్లలో గారెత్ డెలానీ(19), గారీ విల్సన్(17)లు రెండంకెల స్కోరును సాధించారు. దాంతో ఐర్లాండ్ 209 పరుగుల టార్గెట్‌ను విండీస్‌కు నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 204 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. విండీస్ ఆటగాళ్లలో లెండి సిమ్మన్స్(22), ఎవిన్ లూయిస్(53; 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), హెట్మెయిర్(28), పొలార్డ్(31), పూరన్(26), రూథర్‌ఫర్డ్(26)లు తలో చేయి వేసినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. -
ఆటగాళ్లు, బోర్డుకు గ్రెనాడా ప్రధాని మధ్యవర్తిత్వం!
బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ బోర్డుకు ఆటగాళ్లకు మద్య చోటుచేసుకున్న విభేదాలను పరిష్కరించేందుకు గ్రెనాడా ప్రధాని కైత్ మిచెల్ సిద్ధమైయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. భారత్ టూర్ లో భాగంగా నాలుగు వన్డేల అనంతరం విండీస్ ఆటగాళ్లు స్వదేశానికి పయనం కావడంతో సమస్య పరిష్కారం కోసం మిచెల్ ను ఆశ్రయించేందుకు బోర్డు సిద్ధమైంది. విండీస్ తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ లను బీసీసీఐ తాజా రద్దు చేయడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆగమేఘాలపై ఆటగాళ్ల సమస్య పరిష్కారం కోసం వెతుకులాట ఆరంభించింది. ఈ క్రమంలోనే మిచెల్ కలిసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఆటగాళ్లకు బోర్డుకు మధ్య చోటు చేసుకున్న విభేదాలపై బోర్డు మంగళవారం తనను కలవాడినికి సిద్దమైనట్లు తెలిపారు. అయితే ఈ సమస్యను తాను ఒక్కడినే పరిష్కరించలేనని తెలిపారు. దీనిపై ఆటగాళ్లు కూడా సామరస్య పూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవడానికి సహకరించాలన్నారు. 'అసలు వారి మధ్య ఏమీ జరిగిందో నాకు తెలియదు. ప్రస్తుతం కనిపించేది నిజంగా ఇటువంటి పరిస్థితులకు దారితీస్తుందని అనుకోవడం లేదు. అందుకు సంబంధించిన వాస్తవాలు కూడా నాకు పూర్తిగా తెలియవు' అని మిచెల్ తెలిపారు.