breaking news
ground invasion
-
ప్రభుత్వ స్థలంపై కబ్జాకోరుల కన్ను
► రాత్రికి రాత్రే వెలసిన గుడిసెలు ► సకాలంలో స్పందించిన అధికారులు ► ఆక్రమణల తొలగింపు ► భూమి ఆక్రమిస్తే జైలుకే : తహసీల్దార్ కిరణ్‌కుమార్ తిరుపతి రూరల్ మండలంలో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు కబ్జా రాయుళ్లు బరితెగిస్తున్నారు. కోట్ల విలువైన భూముల్లో రాత్రికి రాత్రే గుడిసెలు వేసేస్తున్నారు. తుడా నిర్లక్ష్యంతో అన్యాక్రాంతమవుతున్న రూ.10 కోట్ల విలువైన భూమిని రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించడంతో కాపాడుకోగలిగారు. తిరుపతి రూరల్: తిరుచానూరు పంచాయతీ సర్వే నంబర్ 234లో 100 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉంది. అందులో 30 ఎకరాలను ప్రజా ప్రయోజనాల కోసం 2006లో తుడాకు కేటాయిం చారు. అక్కడ ఎకరా దాదాపు రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తమ పరిధిలోకి తీసుకోవటంలో చూపిన చొరవను దానిని కాపాడటంలో తుడా చూపలేకపోయింది. విలువైన ఈ స్థలంపై కబ్జారాయుళ్లు కన్ను వేశారు. రూ.10 కోట్ల విలువ చేసే రెండు ఎకరాల స్థలంలో గురువారం రాత్రి దాదాపు 30 గుడిసెలు వేసి, ఆక్రమించుకునేందుకు యత్నించారు. సకాలంలో స్పందించిన తహసీల్దార్.. విలువైన తుడా భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్లు తిరుపతి రూరల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్‌కు స్థానికులు సమాచారం అందించారు. స్పం దించిన ఆయన ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ ఇ¯ŒSస్పెక్టర్ శివకుమార్‌ను ఆదేశించారు. ఆక్రమణదారులు అడు్డకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించి, తుడా అధికారులకు సమాచారం అందించారు. కబ్జారాయుళ్లపై పోలీసులకు ఫిర్యాదు.. విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కిరణ్‌కుమార్ పోలీసులను ఆదేశించారు. తహసీల్దార్ ఆదేశాలతో ఆర్ఐ శివకుమార్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి జైలు తప్పదని తహసీల్దార్ కిరణ్‌కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అబ్బన్న, వీఆర్వో మల్లికారు్జనరెడ్డి, వీఆర్ఏ బాలకృష్ణ పాల్గొన్నారు. -
దర్జాగా కబ్జా!
దేవునిఎర్రవల్లి వాగు భూమి ఆక్రమణ పట్టాభూమి అంటున్న కబ్జాదారులు పనులు నిలిపివేయించిన అధికారులు చేవెళ్ల రూరల్, వాగు భూమిపై వారి కన్నుపడింది. తమ భూమే అని చెప్పుకొంటూ యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారు. చేవెళ్ల మండలం దేవునిఎర్రవల్లిలో కొందరు వ్యక్తులు వాగు భూమిని ఆక్రమిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కళ్లముందే వాగు భూమి కబ్జా అవుతున్నా అధికారులకు పట్టడం లేదు. ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు సమీప పొలాల రైతులు వాగు భూమి తమ పొలంలోకే వస్తుందని జేసీబీలతో చదును చేస్తున్నారు. దీంతో వాగు సగభాగం పూడుకుపోతోంది. భారీ వర్షాలు కురిస్తే గతంలో లాగా నీరు సాఫీగా పారకపోగా పక్క పొలాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో పలువురు రైతులు దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అధికారులు దీనిని పరిశీలించి పనులను నిలిపి వేయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు ప్రభుత్వ భూమి సర్వే నం.74పక్కనే 193, 194 సర్వే నంబర్లలో పట్టాభూమి ఉంది. ప్రభుత్వ భూమి సర్వే నం.74లో మొత్తం 35ఎకరాల 27గుంటలు ఉండగా ఇందులో దాదాపు 25 ఎకరాల వరకు ప్రభుత్వం పలువురికి అసైన్ చేసింది. మిగిలింది వాగుకోసం అలాగే ఉంది. వాగుకు ఇరుపక్కల ప్రభుత్వ భూమి ఉంది. వాగు ఇబ్రహీంపల్లి నుంచి దేవునిఎర్రవల్లి మీదుగా ధర్మసాగర్ వరకు ఉంది. ప్రజల రాకపోకల కోసం ఊరేళ్ల గ్రామం వద్ద వాగుపై గతంలో వంతెన నిర్మించారు. ఈ వంతెన పక్కనే ఉన్న 193, 194 సర్వే నంబర్లలో ఉన్న పొలాల రైతులు వాగును కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే వాగుకు పక్కనే ఉన్న పొదలు, చెట్లు పూర్తిగా తొలగించి భూమిని చదును చేశారు. దీనిపై అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదంటూ పలువురు పక్క పొలాల రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ప్రస్తుతానికి భూమి చదును పనులు నిలిపివేయించారు. కాగా, సదరు రైతులు మాత్రం తాము వాగు భూమిని కబ్జా చేయడం లేదని, తమకు ఉన్న పట్టా భూమి ప్రకారం భూమిని చదును చేస్తున్నామని అధికారులకు చెప్పారు. అయితే భూమి సర్వే చేసే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని తహసీల్దార్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. పనులు నిలిపివేయించాం: విజయలక్ష్మి, తహసీల్దార్, చేవెళ్ల దేవునిఎర్రవల్లి గ్రామంలో వాగు పక్కన జరుగుతున్న భూమి చదును పనులు నిలిపివేయించాం. రైతులు మాత్రం ఇది తమ పట్టాభూమి అని చెబుతున్నారు. భూమి సర్వే చేయాలని వీఆర్ఓ, ఆర్ఐలను ఆదేశించాం. అనుమతి లేకుండా చదును చేసినా, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారెవరైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.