ground nuts
-
Health: ప్రతి రోజూ ఓట్స్ తింటున్నారా? గుండెకు సంబంధించి ఈ విషయాలు తెలిస్తే
Heart Healthy Foods- Diet Tips In Telugu: అప్పటిదాకా నచ్చిన రుచులన్నీ కడుపునిండా తిన్న వారికి ఏ డయాబెటిస్సో, గుండెజబ్బో, కొలెస్టరాలో వచ్చిందంటే పాపం! వారి బాధ చెప్పనలవి కాదు. ఎందుకంటే అటు నోరుకట్టుకోనూలేరు, ఇటు ఇష్టం వచ్చినవన్నీ తినడానికీ లేదు. అలాగని పూర్తిగా చప్పిడి తిండే తినమంటే మరీ నీరసించి పోతారు. ఇంతకీ మీరు చెప్పేదేమిటీ అనుకుంటున్నారా? కాస్త ఓపిక పట్టండి మరి! నోటికి రుచికరంగా ఉంటూనే, గుండెకు బలం చేకూరేలా, ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలగకుండా కాపాడుకునేలా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు వైద్యులూ, పోషకాహారనిపుణులూ. అవేమిటో తెలుసుకుందామా? ఆకుపచ్చని కూరలు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలన్నీ గుండెకు బలాన్నిఇస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూర గుండెకు చాలా మంచిది. బచ్చలికూరతో పప్పు వండుకోవచ్చు. సెనగపప్పు వేసి పప్పు కూర చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. అయితే నూనె, ఉప్పు, కారం పరిమితంగానే వాడాలి. టొమాటల్లోని లైకోపిన్ వల్ల టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. టొమాటోలలో రక్తపోటును నియంత్రించే పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి పుల్లపుల్లగా, తియ తియ్యగా ఉండే టొమాటోలను విరివిగా తినచ్చు. చేపలు తింటే చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువ. అందుకే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. స్ట్రా బెర్రీలతో స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం, ఎండు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ గుప్పెడు తింటే గుండెకు చాలా మంచిది. అలాగే ద్రాక్షపండ్లు కూడా గుండెకు సత్తువనిస్తాయి. అయితే ద్రాక్షను రసం తీసి కాకుండా నేరుగా తినడం మేలు. ఎందుకంటే ద్రాక్షరసంలో చక్కెర కలుపుకోవడం అనివార్యం కదా! డార్క్ చాక్లెట్లు తింటే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు. కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన డార్క్ చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల మాత్రం గుండెకు మేలు చేకూరకపోగా ముప్పే. అలాగని డార్క్ చాక్లెట్లను కూడా మితిమీరి తినకూడదు. గుండెకు మేలు చేసే 5 ఆహార పదార్థాలు వేరుశెనగ గుండెకు వేరుశెనగ ఎంతో మంచిది. మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అవి గుండె భేషుగ్గా ఉండటానికి సహకరిస్తాయి. అలాగే వేరుశెనగలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ గుండె ఆరోగ్యానికి నారింజ పండు చాలా మంచిది. పొటాషియం అధికంగా ఉండే నారింజలో ఎలక్ట్రోలైట్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు కూడా గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడతాయి. అవకాడో విటమిన్–ఈతో పాటు అనేక ఇతర పోషకాలు అవకాడోలో సమృద్ధిగా లభిస్తాయి. దీనికితోడు మోనో అన్ –శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఈ పండు గుండెకు చాలా మంచిది. అవకాడోను రోజూ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు నుంచి బయటపడవచ్చు. వాల్నట్స్ రోజూ క్రమం తప్పకుండా కాసిని వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్నట్స్ హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంతోపాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఓట్స్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఓట్స్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఓట్స్‌లో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ప్రతీ రోజూ ఓట్స్ తినడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? అయితే Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. -
Health Tips: హై బీపీ ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే..
ప్రస్తుత కాలంలో జీవనశైలి మూలాన వస్తున్న సమస్యలలో బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్, ఎసిడిటీ, కడుపులో పుండ్లు వంటివి ముఖ్యమైనవి. వాటిలో అతి ముఖ్యమైనది బీపి. దీనికి వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. తక్కువ వయసు వారు కూడా హైబీపితో బాధపడుతున్నారు. రక్తపోటు పెరిగిపోవడం వల్ల ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం ప్రయోజనకరం. అవేంటో తెలుసుకుందాం.. పల్లీలు, బాదం, జీడిపప్పు అధిక రక్తపోటును అదుపు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే వాటిని ఎలా తీసుకోవాలో చూద్దాం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు నట్స్‌ను దూరం పెడుతుంటారు. వీటిని తింటే మరింత బరువు పెరిగిపోతామేమోననే అపోహతో. అయితే అది సరికాదు. ఎందుకంటే వేరుశెనగ, బాదం పప్పుల వల్ల బరువు పెరగరు. ఇవి మీ శరీర బరువు మరింత పెరగకుండా అడ్డుకుంటాయి కూడా. పల్లీలు పల్లీలు లేదా వేరుసెనగ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు వేరువెనగ గింజలు తినడం వల్ల వంటి పనితీరు బాగుంటుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా తొలగిపోతుంది. కొలెస్ట్రాల్ వంటి రోగాల ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ఈ గింజలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేరుశెనగల్లో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ వేరుశెనగలను తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బీపీని పెంచే కారకాలలో కొలెస్ట్రాల్ ముందుంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే రక్తపోటుకు కళ్లెం వేయడం సులభం అవుతుంది కాబట్టి రోజూ నానబెట్టిన పల్లీలు తీసుకోవడం మంచిది. బాదం పప్పు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించేందుకు బాదం పప్పులు ఎంతో సహాయపడతాయి. గుప్పెడు వేరుసెనగ గింజలను, నాలుగైదు బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే బీపీ, డయాబెటిస్ అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని, అధిక రక్తపోటునూ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల శరీర బలం పెరుగుతుంది. జీడిపప్పులు జీడిపప్పులు తింటే బరువు పెరిగిపోతామని వీటిని ముట్టని వారు చాలా మందే ఉన్నారు. నిజానికి అది సరికాదు.. జీడిపప్పులు బరువును పెంచడానికి బదులుగా.. బరువును కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. శీతాకాలంలో 2 నుంచి 3 జీడిపప్పులను తినడం శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే శరీర శక్తిని కూడా పెంచుతుంది. వీటిలో పిస్తాపప్పు, ఇతర గింజల కంటే ఎక్కువ పోషకాలుంటాయి. ఇది రుచిగానే కాదు.. మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మానికి ప్రయోజనకరం డ్రై ఫ్రూట్స్‌లో చాలావరకు విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ ఇ ,మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతాయి. సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పేననడంలో ఎలాంటి సందేహం లేదు. చాపకింద నీరులా గుండె కవాటాలను పూడ్చివేసి, గుండె పనితీరును మందగింపజేసే బీపీని అదుపులో ఉంచుకోకపోతే చాలా ప్రమాదం. అయితే అది మందుల ద్వారానే కాదు, నిత్యం ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చునంటున్నారు ఆహార నిపుణులు. వీటన్నింటితోపాటు కంటినిండా నిద్రపోవడం, నిత్యం వాకింగ్ చేయడం కూడా చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! High Uric Acid Level: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే.. -
Health Tips: పచ్చి పల్లీలు తింటున్నారా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్ వల్ల..
Health Benefits Of Groundnuts: పొద్దున్నే టిఫిన్‌లోకి పల్లీల చట్నీ... సాయంత్రం బోర్ కొడితే వేయించిన పల్లీలతో స్నాక్స్ రెడీ. సాధారణంగా మన దేశంలోని ప్రతి వంటగదిలో దర్శనమిస్తాయి వేరుశెనగలు.. అదేనండీ పల్లీలు. అంతేకాదు మనలో ఎక్కువ శాతం మంది వేరుశనగల నుంచి తీసిన నూనెనే వంటకాల్లో వాడుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వేరుశెనగ పంట.. ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇది ఒక ప్రధాన పంటగా పేరొందింది. వీటిని కొన్నిచోట్ల పల్లీలు అని కూడా పిలుస్తుంటారు. నిజానికి వేరుశనగలు బలవర్ధకమైన ఆహారం. నోటికి రుచిగా అనిపించే పల్లీల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం! వేరుశెనలో ఉండే పోషకాలు: ►వేరుశనగలో పిండి, పీచు పదార్థాలు అధికం. ►ప్రొటిన్లు కూడా తగు మోతాదులో ఉంటాయి. ►ఇక విటమిన్లలో సి, ఎ, బి6 ఎక్కువగా ఉంటాయి. ►ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా వేరుశెనగల్లో మెండు. ►సాధారణంగా 100 గ్రాముల వేరుశెనగల్లో సుమారుగా 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రొటిన్లు, 49.2 గ్రాముల ఫ్యాట్, 16.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. వేరుశెనగలు/పల్లీల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ►పచ్చి పల్లీలు తీసుకుంటే గుండె పనితీరు మెరుగు అవతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. ►మెదడు పనితీరును కూడా పల్లీలు మెరుపరుస్తాయి. ►అల్జీమర్స్‌ను తగ్గించి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. వీటిలోని విటమిన్ బీ3 ఇందుకు దోహదం చేస్తాయి. ►ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ►చెడు కొవ్వును తగ్గిస్తాయి. ►సెరోటోనిన్(ఎమైనో ఆసిడ్ ట్రిప్టోఫాన్ నుంచి తయారయ్యే మోనోఎమైన్)ను విడుదల చేసి ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ►ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు, విటమిన్ ఇ అధికం. తద్వారా గుండె నుంచి ఇతర భాగాలకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు ముసుకుపోకుండా కాపాడతాయి. ►పొట్టలో పడే క్యాన్సర్‌ను కూడా వేరుశెనగలు తప్పించగలవు. ►మెదడుకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు కూడా ఇవి దోహదపడతాయి. ►బరువు, మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. చదవండి: Sweet Potato Day- Health Benefits: చిలగడ దుంప తినడం ఇష్టమా.. ఈ విషయాలు తెలిస్తే! -
ఫలించిన అమ్మ కష్టం
కాలం పెట్టే పరీక్షలను ఎదురొడ్డుతూ ఆ తల్లి నిత్యం శనక్కాయల బొచ్చ నెత్తిన మోస్తూ బతుకు బండిని నెట్టుకొస్తోంది. వివరాలివి.. నరసరావుపేట పట్టణంలోని పెదచెరువులో నివాసముంటున్న పల్లపు కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్న కోటేశ్వరమ్మ శనక్కాయలు అమ్ముతోంది. వారి ఇద్దరు కుమారులు ఆదిశేషు, గోపిలు మతిస్ధిమితం లేకుండా జన్మించారు. దీంతో ఆమెకు మరిన్ని కష్టాలు నెత్తినపడ్డాయి. కోటేశ్వరమ్మ తల్లి అంజమ్మ 20 ఏళ్లుగా స్థానిక కోర్టు, తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయ ప్రాంగణాల్లో శనక్కాయలు అమ్ముతూ జీవనం సాగించేది. ఆమె తదనంతరం అదే వృత్తిని కొనసాగిస్తున్న కోటేశ్వరమ్మ తనలాగా తన కుమార్తె, కొడుకులు కష్టాలు పాలు కాకుండా ఉండాలని భావించింది. కూడబెట్టిన డబ్బులతో కుమార్తె అనూషను ఎంబీఏ చదివించింది. తమ కోసం తల్లి పడుతున్న కష్టాలను దగ్గరగా చూసిన అనూష ఎలాగైనా ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలని భావించింది. దీంతో ఈ ఏడాది రెండుసార్లు కానిస్టేబుల్ సెలక్షన్స్‌కు వెళ్లింది. మొదటిసారి అపజయం ఎదురైనా రెండోసారి పట్టుదలతో విజయం సాధించింది. గత ఏడాది మే 19న కానిస్టేబుల్‌గా ఎన్నికైంది. కుమార్తెకు ఉద్యోగం రావడంతో తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని కోటేశ్వరమ్మ భావిస్తోంది. తన కుటుంబాన్ని ఆదుకునేందుకు మతిస్ధిమిత్తం లేని ఇద్దరు కుమారులను చూసుకునేందుకు అనూష అండగా నిలుస్తుందని ఆశిస్తోంది. మహానేత ైవె ఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంబీఏ వరకు చదువుకున్నానని అనూష చెప్పింది. ఈ ఉద్యోగంతో సంతృప్తి పడకుండా రానున్న రోజుల్లో ఎస్ఐగా సెలక్ట్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. సమాజంలో మహిళలు పడుతున్న ఇబ్బందుల పరిష్కరించే దిశగా ముందుకె ళతానని చెప్పింది.