‘గ్రౌండ్ వాటర్’ పోస్టులకు 17న ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: గ్రౌండ్ వాటర్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులకు ఈనెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. 79 మందిని ఇందుకోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారి జాబితాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.