group 2 notification
-
AP: గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ‘ఇంగ్లిష్’లో మనమే టాప్! -
వారంలో గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్!
- 2,444 గురుకుల టీచర్ల భర్తీకి కూడా - టీఎస్పీఎస్సీ భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లో అదనంగా భర్తీ చేయతలపెట్టిన 593 పోస్టులకు వారం రోజుల్లో అనుబంధ నోటిఫికేషన్ జారీ కానుంది. దీంతోపాటు వివిధ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2,444 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని మంగళవారం జరిగిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. 439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ జారీ అయినా.. తక్కువ పోస్టులున్నాయన్న కారణంతో ఏప్రిల్లో జరగాల్సిన పరీక్షలను ప్రభుత్వమే వాయిదా వేయించింది. మరిన్ని పోస్టుల భర్తీ చేపడతామని, వాటితో కలిపి పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ మేరకు మరో 593 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ జూలైలో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి టీఎస్పీఎస్సీ ఇండెంట్లు కూడా తెప్పించుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ తొలివారంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.