group-D exams
-
తేజస్వీకి ఈడీ తాజా సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నకాలంలో కొందరి భూములు రాయించుకుని వారికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు పాత్ర ఉందంటూ ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. జనవరి ఐదో తేదీన తమ ఆఫీస్‌కు రావాలని తేజస్వీకి సూచించింది. డిసెంబర్ 22వ తేదీనే రావాలని గతంలో సమన్లు జారీచేయగా ఆయన రాలేదు. దీంతో మళ్లీ సమన్లు ఇచ్చారు. ఇదే కేసులో డిసెంబర్ 27వ తేదీన హాజరుకావాలని లాలూకు సైతం ఈడీ సమన్లు పంపడం తెల్సిందే. ‘ సమన్లలో కొత్తదనం ఏదీలేదు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈడీ ఆఫీస్కెళ్లాను. ఇదో రోటీన్ పనిలా తయారైంది’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు. యూపీఏ–1 హయాంలో 2004– 2009 కాలంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో కొందరికి వేర్వేరు రైల్వేజోన్లలో గ్రూప్–డీ ఉద్యోగాలిచ్చి, లాలూ కుటుంబసభ్యుల, వారికి చెందిన ఏకే ఇన్ఫోసిస్టమ్స్ సంస్థ పేరు మీదకు ఆ లబ్దిదారుల భూములను బదలాయించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న అమిత్ కాత్యాల్‌ను ఈడీ ఇటీవల అరెస్ట్‌చేసింది. ఈ సంస్థ రిజి్రస్టేషన్ అడ్రస్‌లో ఉన్న ఇల్లు లాలూదేనని ఈడీ పేర్కొంది. లబి్ధదారుల భూముల బదలాయింపు సంస్థలోకి జరిగాక ఆ వాటాలను 2014 ఏడాదిలో లాలూ కుటుంబసభ్యుల పేరు మీదకు బదిలీచేశారని ఈడీ చెబుతోంది. ఈ ఉదంతంపై గతంలో సీబీఐ నమోదుచేసిన కేసును ఆధారంగా చేసుకుని ఈడీ కొత్తగా కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తోంది. -
23, 30 తేదీల్లో రైల్వే గ్రూప్-డీ ఎగ్జామ్స్
దళారులను నమ్మి మోసపోవద్దు: సీపీఆర్వో సాక్షి, హైదరాబాద్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గ్రూప్-డీ తుది విడత పరీక్షలు ఈ నెల 23, 30ల్లో జరగనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4గంటల వరకు జరుగుతాయన్నారు. హైదరాబాద్, సికిం ద్రాబాద్, విజయవాడ, గుంటూరు, నాందేడ్, తిరుపతిలో పరీక్షల కోసం ఏర్పా ట్లుచేసినట్లు చెప్పారు. కాల్‌లెటర్స్ అందని వారు దక్షిణమధ్య రైల్వే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 040-27788824 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. గ్రూప్-డీఉద్యోగాలిప్పిస్తామనే మోసగాళ్ల గురించి 09701370053, 040-27830516 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చన్నారు.