రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ గ్రూప్-డీ తుది విడత పరీక్షలు ఈ నెల 23, 30ల్లో జరగనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు బుధవారం ప్రకటనలో తెలిపారు.
దళారులను నమ్మి మోసపోవద్దు: సీపీఆర్వో
సాక్షి, హైదరాబాద్: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ గ్రూప్-డీ తుది విడత పరీక్షలు ఈ నెల 23, 30ల్లో జరగనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4గంటల వరకు జరుగుతాయన్నారు. హైదరాబాద్, సికిం ద్రాబాద్, విజయవాడ, గుంటూరు, నాందేడ్, తిరుపతిలో పరీక్షల కోసం ఏర్పా ట్లుచేసినట్లు చెప్పారు. కాల్‌లెటర్స్ అందని వారు దక్షిణమధ్య రైల్వే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 040-27788824 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు. గ్రూప్-డీఉద్యోగాలిప్పిస్తామనే మోసగాళ్ల గురించి 09701370053, 040-27830516 నంబర్‌లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చన్నారు.