breaking news
GST 2.0
-
జీఎస్టీ సంస్కరణలు దీపావళి ముందే ఎందుకంటే..
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రశంసించారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికీ భారీ విజయమని ఆమె అభివర్ణించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలు ఎందుకన్నదానిపైనా ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి వారి సొంత పండుగలు ఉంటాయన్న నిర్మలా సీతారామన్.. దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలును ప్రారంభించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలకు ముందే నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.చెన్నై సిటిజన్స్ ఫోరం నిర్వహించిన 'ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ రైజింగ్ భారత్' కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, దేశ ప్రజలు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని ఉత్పత్తులపైనా జీఎస్టీ ప్రయోజనకరమైన ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు.జీఎస్టీ కింద గతంలో 12 శాతం పన్ను విధించిన 99 శాతం వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటివరకు ఉన్న శ్లాబులను రెండు శ్లాబులకే జీఎస్టీ కౌన్సిల్ కుదించింది. ఇకపై 5, 28 శాతం పన్ను శ్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. తాజా జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు -
అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఇదిగో ఇంతే..
అమెరికా టారిఫ్‌ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీపై నికరంగా పడే ప్రభావం 0.2–0.3 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. అయితే జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీ డిమాండ్‌ను పెంచడం ద్వారా ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమెరికాకు చేసిన ఎగుమతుల్లో సగం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే నమోదైనట్టు గుర్తు చేశారు.సుంకాలు స్వల్పకాలమే గానీ, దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చన్నారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అప్పుడు ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయంటూ.. పెట్టుబడులు, మూలధన వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్‌పై దీని తాలూకూ అనిశ్చితి ఉంటుందని చెప్పారు.అయితే, జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీయంగా బలమైన వినియోగ సృష్టి ద్వారా టారిఫ్‌ల తాలూకూ ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలను అధిగమించేందుకు సాయపడతాయన్నారు. కనుక మొత్తం మీద జీడీపీపై పడే ప్రభావం 0.3 శాతం మించి ఉండదన్నారు. 2025–26 సంవత్సరానికి 6.3–6.8% మధ్య జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చన్న తమ అంచనాలను గుర్తు చేశారు.సాగులో సంస్కరణలు.. వ్యవసాయ రంగం జీడీపీకి మరో 0.5–0.70 శాతం వరకు తోడ్పాటునివ్వగలదని నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకు గాను రైతులు వారు కోరుకున్న చోట విక్రయించే హక్కు అవసరమన్నారు. ప్రకృతి విపత్తులపై సాగు దిగుబడులు ఆధారపడి ఉన్నందున వారికి బీమా రూపంలోనూ దన్నుగా నిలవాలన్నారు. ప్రపంచ వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్ స్థానాన్ని భర్తీ చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని సీఈఏ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు.అటువంటి చర్యలో భారత్ పాలుపంచుకోదని ఓ ప్రశ్నకు సమాధనంగా చెప్పారు. డాలర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదంటూ.. ఇందుకు చాలా కాలం పట్టొచ్చన్నారు. గతేడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యానికి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులకు, ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటుకు అంగీకారం కుదరడం గమనార్హం. -
తగ్గనున్న పాల ప్యాకెట్ల ధరలు..
ప్రతి ఇంట్లో వాడే పాల ధరలు త్వరలో తగ్గనున్నాయి. ప్యాకేజ్డ్ మిల్క్ పై 5 శాతం జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన వెంటనే దేశంలోని దాదాపు అన్ని బ్రాండ్ల పాల ప్యాకెట్ల ధరలపైనా తక్షణ ఉపశమనం లభించనుంది.ఈ జీఎస్టీ మినహాయింపు నేరుగా సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే పాలపై 5% పన్ను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఉండదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో పాలు వంటి నిత్యావసర వస్తువులను మరింత అందుబాటులో ధరల్లోకి తీసుకురావాలనేది ఈ చర్య ఉద్దేశం.దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న ప్రముఖ పాల ఉత్పత్తుల బ్రాండ్లలో ఒకటైన అమూల్, మదర్ డెయిరీ ప్రస్తుత ధరలు, జీఎస్టీ తొలగింపు అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత తగ్గుతాయన్నది ఈ కింద చూద్దాం. అమూల్ ఉత్పత్తులలో ఫుల్ క్రీమ్ మిల్క్ 'అమూల్ గోల్డ్' ధర ప్రస్తుతం లీటరుకు రూ. 69 కాగా, టోన్డ్ మిల్క్ రూ.57. అదే విధంగా మదర్ డైరీ ఫుల్ క్రీమ్ మిల్క్ రూ. 69, టోన్డ్ మిల్క్ సుమారు రూ.57 ఉంది. గేదె, ఆవు పాలు ధరలు కూడా రూ.50-75 మధ్య ఉన్నాయి.జీఎస్టీ ఎత్తివేసిన తర్వాత ధరలు ఎంత తగ్గుతాయి?ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం పాల ధరలు లీటరుకు రూ.3 నుంచి రూ.4 వరకు తగ్గుతాయి. ఉదాహరణకు, అమూల్ గోల్డ్ ధర సుమారు రూ .65-66 కు తగ్గుతుంది, మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర కూడా అదే స్థాయిలో తగ్గుతుందని భావిస్తున్నారు. టోన్డ్ మిల్ఖ్, గేదె పాలపై కూడా ఇలాంటి ఉపశమనం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది వినియోగించే విజయ ప్యాకేజ్డ్ పాలు కూడా జీఎస్టీ మినహాయింపు తర్వాత లీటర్‌కు రూ.2 నుంచి రూ.3 తగ్గే అవకాశం ఉంది.పాల రకంప్రస్తుత ధర (లీటరుకు)కొత్త ధర (లీటరుకు)అమూల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్)₹69₹65–66అమూల్ ఫ్రెష్ (టోన్డ్)₹57₹54–55అమూల్ టీ స్పెషల్₹63₹59–60అమూల్ గేదె పాలు₹75₹71–72అమూల్ ఆవు పాలు₹58₹55–57మదర్ డైరీ ఫుల్ క్రీమ్₹69₹65–66మదర్ డైరీ టోన్డ్ మిల్క్₹57₹55–56మదర్ డైరీ గేదె పాలు₹74₹71మదర్ డైరీ ఆవు పాలు₹59₹56–57 -
టయోటా కార్ల ధరల తగ్గింపు.. ఫార్చూనర్పై రూ.3.5 లక్షలు..
జీఎస్టీ తగ్గింపు, పరిహార సెస్ రద్దు వాహన కొనుగోలుదారులతో పాటు తయారీదారులకు భారీ ఉపశమనం కలిగించింది. ఇది కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా అన్ని రకాల వాహనాల ధరలపైనా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఫలితంగా, వాహన తయారీ సంస్థలు తమ అన్ని మోడళ్ల సవరించిన ధరలను ప్రకటించడం ప్రారంభించాయి.తాజాగా జపాన్ ఆటో దిగ్గజం టయోటా తమ అన్ని కార్లపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. సకాలంలో డెలివరీలు అందుకోవడానికి పండుగ సీజన్ ప్రారంభానికి ముందే వీలైనంత త్వరగా బుకింగ్‌లను కన్ఫర్మ్ చేసుకోవాలని కస్టమర్లను కోరింది.కొన్ని ప్రీమియం మోడళ్ల తగ్గింపు ధరలను కంపెనీ ప్రకటించింది. తాజా అప్ డేట్ ప్రకారం. అత్యధికంగా ఫార్చ్యూనర్ ధర రూ .3.49 లక్షల వరకు తగ్గుతుంది. దీని తరువాత మరో ప్రీమియం వేరియంట్ లెజెండర్ ధర రూ .3.34 లక్షల వరకు తగ్గనుంది. ఫార్చ్యూనర్, లెజెండర్ ధరలు వరుసగా రూ .36.05 లక్షలు, రూ .44.51 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. తమ లైనప్ లోని ప్రతి మోడల్ ప్రతి వేరియంట్ సవరించిన ధరలను టయోటా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.సవరించిన జీఎస్టీ నిర్మాణం అన్ని విభాగాలలో కార్ల ధరలను తగ్గించింది. 4 మీటర్ల లోపు పరిమాణం ఉన్న చిన్న కార్లపై (1,200సీసీ వరకు పెట్రోల్ ఇంజిన్లు లేదా 1,500 సీసీ వరకు డీజిల్ ఇంజిన్లు) ఇకపై 28% బదులుగా 18% జీఎస్టీ వర్తిస్తుంది.దీంతో వీటి ధరలు 5-13% తగ్గుతున్నాయి.ఇక 4 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణం, పెద్ద ఇంజిన్లు ఉన్న పెద్ద కార్లపై 28 శాతం జీఎస్టీకి బదులుగా 40 శాతం (ప్రత్యేక శ్లాబ్) జీఎస్టీ విధిస్తారు. అయితే సెస్ తొలగింపుతో వీటి ధరలు కూడా 3-10% తగ్గే అవకాశం ఉంది. -
జీఎస్టీ 2.0.. స్వదేశీ అని గర్వంగా చెప్పండి: ప్రధాని మోదీ
జీఎస్టీ 2.0 పేరిట తెచ్చిన సంస్కరణలను మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో భాగంగానే పరిగణించాలని.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్డీయే ఎంపీలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సోమవారం ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. GST 2.0 సంస్కరణల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో 20 నుంచి 30 సమావేశాలు నిర్వహించాలి. స్థానిక వ్యాపారులు, దుకాణదారులకు GST 2.0 ప్రయోజనాలు వివరించాలి. నవరాత్రి నుంచి దీపావళి మధ్య.. స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం స్థానిక హస్తకళాకారులు, చిన్న పరిశ్రమలు పాల్గొనే స్వదేశీ ప్రదర్శనలు, జాతరలు నిర్వహించాలి. గర్వంగా చెప్పండి.. ఇది స్వదేశీ అనే నినాదంతో అన్ని రంగాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించాలని సూచించారు.అదే సమయంలో పంజాబ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వరదలు కారణంగా ఎన్డీయే ఎంపీల విందు కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఉత్సవ విందు ఎలా నిర్వహించగలను? అని అన్నారాయన. ప్రజలపై పన్ను భారం తగ్గించడంతో పాటు భారత ఎకానమీకి బూస్ట్ ఇస్తుందని భావిస్తోంది. జీఎస్టీ 2.0 అనేది భారత ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా పన్ను సంస్కరణ. ఇది 2025 సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానుంది. 2017లో ప్రారంభమైన జీఎస్టీ వ్యవస్థకు పెద్ద మార్పుగా భావించబడుతోంది.ప్రధాన మార్పులు:• పాత slabs: 0%, 5%, 12%, 18%, 28% + cess• కొత్త slabs: 0%, 5%, 18%, 40% (cess తొలగింపు)ధరలు తగ్గిన వస్తువులు:👉అవశ్యక వస్తువులు: పన్ను 0%పన్నీర్, చపాతీ, UHT పాలు, అవసరమైన ఔషధాలు👉 ప్రాముఖ్యమైన వినియోగ వస్తువులు: 5%షాంపూ, టూత్‌పేస్ట్, హేర్ ఆయిల్, వ్యవసాయ పరికరాలు👉సాధారణ వస్తువులు: 18%TVs, ACs, వాషింగ్ మెషీన్లు, చిన్న కార్లు👉లగ్జరీ & హానికర వస్తువులు: 40%పొగతాగే పదార్థాలు, పాన్ మసాలా, లగ్జరీ కార్లు👉ఆటోమొబైల్ రంగంపై ప్రభావం.. చిన్న కార్లు: GST 28% → 18% (ధరలు తగ్గాయి). బెండ్స్, టాటా, హ్యుందాయ్, రెనాల్ట్ వంటి కంపెనీలు రూ. 60,000–₹10 లక్షల వరకు ధరలు తగ్గించాయి👉 ఇన్సూరెన్స్ పాలసీలు: జీవన, ఆరోగ్య బీమాలపై GST పూర్తిగా మాఫీ👉పాఠశాల వస్తువులు: పెన్సిల్, షార్పెనర్, నోట్‌బుక్‌లపై పన్ను తగ్గింపు👉వ్యవసాయ పరికరాలు: ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్, కంపోస్టింగ్ యంత్రాలు — 5% GSTజీఎస్టీ 2.0 లక్ష్యాల్లో ప్రధానమైంది సాధారణీకరణ. పన్ను slabs తగ్గించడం ద్వారా వ్యాపారులకు సులభతరం అవుతుంది. అవసరమైన వస్తువులపై పన్ను తగ్గింపుతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పాటు, తద్వారా వినియోగం పెరగడం ద్వారా GDP వృద్ధి చెందుతుంది. పన్ను వ్యవస్థలో స్పష్టత, పారదర్శకత కారణంగా.. వివాదాలు, విమర్శలు తొలగిపోతాయనే ఆలోచనతోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉంది. -
జావా, యెజ్డి బైక్‌ల ధరలు తగ్గింపు.. కొత్త రేట్లు ప్రకటించిన కంపెనీ
క్లాసిక్ లెజెండ్స్ (సీఎల్) తమ జావా, యెజ్డి బైక్‌ల కొత్త ధరలను ప్రకటించింది. వీటిలో అడ్వెంచర్, రోడ్‌స్టర్, బాబర్ నుండి స్క్రాంబ్లర్ వరకు ఉన్నాయి. ఇప్పుడివి రూ .2 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి. పర్యావరణానికి పనికిరాదని భావించిన టూ స్ట్రోక్ మోటార్ సైకిల్ ను నిషేధించిన విధాన మార్పు కారణంగా భారతదేశంలో జావా, యెజ్డీ అమ్మకాలను కంపెనీ గతంలో నిలిపివేసింది. అయితే జీఎస్టీ 2.0 సంస్కరణలతో, జావా, యెజ్డీ బైక్‌లు తిరిగి రోడ్లపైకి వస్తాయని కంపెనీ తెలిపింది.350 సీసీ లోపు మోటార్ సైకిళ్లపై జీఎస్టీని తగ్గించి 18 శాతం పరిధిలోకి తీసురావడాన్ని స్వాగతిస్తున్నట్లు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో తమ 293 సీసీ జావా, 334 సీసీ యెజ్డి పర్ఫార్మెన్స్ క్లాసిక్ బైక్‌ల ధరలు కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.కొత్త ధరలు ఇవే42 మోడల్ పాత ధర రూ.1,72,942 కాగా కొత్త ధర రూ.1,59,431 తగ్గింపు రూ. 13,511జావా 350 పాత ధర రూ.1,98,950, కొత్త ధర రూ.1,83,407, తగ్గింపు రూ.15,54342 బాబర్ పాత ధర రూ.2,09,500, కొత్త ధర రూ.1,93,133, తగ్గింపు రూ.16,36742 బాబర్ (ఇంకొక వేరియంట్) పాత ధర రూ.2,10,142, కొత్త ధర రూ.1,93,725, తగ్గింపు రూ.16,417పెరక్ పాత ధర రూ.2,16,705, కొత్త ధర రూ.1,99,775, తగ్గింపు రూ.16,930 -
జీఎస్టీ 2.0.. కాంగ్రెస్ క్రెడిట్‌పై నిర్మలమ్మ చురకలు
వస్తు సేవల పన్ను (GST) 2.0 క్రెడిట్ ముమ్మాటికీ తమదేనంటున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చురకలంటించారు. గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించినవాళ్లే.. ఇప్పుడు GST 2.0కు క్రెడిట్ తీసుకుంటున్నారని అన్నారామె. గతంలో వస్తు సేవల పన్నును గబ్బర్ సింగ్ టాక్స్ అని అభివర్ణించిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు అదే పన్ను వ్యవస్థలో మార్పుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘GST 2.0 అనేది ప్రజల కోసం, వ్యాపారాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది రాజకీయ విమర్శలకు సమాధానం కాదు. కానీ, గతంలో దీనిని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని పిలిచినవాళ్లే ఇప్పుడు దీన్ని తమ విజయం అని చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ అన్నారు.అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో దీన్ని ఎందుకు అమలు చేయలేకపోయిందో చెప్పాలి? అని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో GST అమలు చేయడం అసాధ్యమని భావించిందని, కానీ మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఇప్పుడు రెండో దశ సంస్కరణలు కూడా తీసుకువస్తోందని పేర్కొన్నారు.పన్ను శ్లాబ్‌ల సరళీకరణ, 5% & 18% ప్రధాన శ్లాబ్‌లు, 40% సిన్ టాక్స్ (తంబాకూ, లగ్జరీ వస్తువులపై) GST 2.0లో కీలక మార్పులని చెప్పొచ్చు. అయితే.. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిని ఆయుధంగా చేసుకునే ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. జీఎస్టీ 2.0పై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ఇది రాహుల్ గాంధీ 2016లో సూచించిన 18% GST క్యాప్‌ను అనుసరించడమే అని పేర్కొన్నారు. GST 2.0లో సాధారణ వినియోగదారులకు ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో తీసుకున్న చర్యలపై తమ పాత్రను గుర్తు చేశారు.ఇదిలా ఉంటే.. జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటగా పిలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. 2017 అక్టోబర్‌లో గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్య చేశారు. జీఎస్టీలో 28% అత్యధిక పన్ను ఉంది, మూడు రిటర్న్ ఫారమ్‌లు ఉన్నాయి. ఇది ప్రజలపై భారం పెడుతోంది. ఇది గబ్బర్ సింగ్ టాక్స్లా ఉంది అని అన్నారాయన. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ షోలేలోని విలన్ గబ్బర్ సింగ్ లాగా, ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందన్న ఉద్దేశంతో ఆయన పై వ్యాఖ్య చేశారు. GST అమలులో బహుళ పన్ను శ్లాబ్‌లు, క్లిష్టమైన కంప్లయన్స్ విధానం ఉండటం వల్ల చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమయంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి కూడా.