gst counsil
-
ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీకే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సుముఖత చూపిస్తున్నారు. అది గేమ్ లేక నైపుణ్యం లేక మరొకటి అయినా 28 శాతం జీఎస్టీ రేటు ఉండాలని కోరుతున్నారు. 28 శాతం జీఎస్టీ ప్రతికూలమని, తక్కువ పన్ను రేటునే కొనసాగించాలని పరిశ్రమ కోరుతుండడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై పన్ను రేటు పెంపు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన నేపథ్యంలో.. దీనిపై మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా మంగళవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెజారిటీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను రేటును 28 శాతానికి పెంచాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రుల గ్రూప్ ఈ సూచనలను జీఎస్టీ మండలికి నివేదించనుంది. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ సూచనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. స్థూల గేమింగ్ ఆదాయంపై ఈ పన్ను అమలు చేస్తున్నారు. -
‘విపత్తు పన్ను’ అధ్యయనానికి జీవోఎం
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసింది. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ దీనికి నేతృత్వం వహించనున్నారు. అక్టోబర్ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రకృతి విపత్తుల బారినపడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కొన్ని వస్తువులపై అదనపు పన్ను విధించేందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీ మండలి లేవనెత్తిన పలు కీలక అంశాలను మంత్రుల బృందం పరిశీలించనుంది. ప్రభావిత రాష్ట్రంపైనే కొత్త పన్నును విధించాలా? లేక మొత్తం దేశానికి వర్తింపచేయాలా? ఏయే వస్తువులపై అదనపు పన్ను విధించాలి? విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యం సరిపోతుందా? విపత్తు పన్నును ఏయే పరిస్థితుల్లో విధించాలి? తదితరాలపై అధ్యయనం చేస్తుంది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్‌లకు కమిటీలో చోటు కల్పించారు. -
పాలు, ఆహారధాన్యాలపై పన్ను ఎత్తివేత
జీఎస్టీ రేట్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇవి సామాన్యుడికి ఉపయోగపడే రీతిలోనే కనిపిస్తున్నాయి. జీఎస్టీ పుణ్యమాని ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు చాలావరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. పాలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించారు. అంటే, పాల అమ్మకాల మీద ఇకమీదట ఎలాంటి పన్ను ఉండబోదు. అలాగే ఆహార ధాన్యాలు కూడా ధరలు తగ్గుతాయి. వాటిమీద ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా, జీఎస్టీని వాటికి కూడా పూర్తిగా మినహాయించారు. బొగ్గు మీద ప్రస్తుతం 11.69% పన్ను ఉండగా, జీఎస్టీని 5%కు పరిమితం చేశారు. అలాగే పంచదార, టీ, కాఫీ, వంటనూనెల మీద కేవలం 5% పన్ను మాత్రమే పడుతుంది. దాదాపు 60 శాతం వరకు వస్తువులు 12-18% శ్లాబు పరిధిలోకే వస్తున్నాయి. తలనూనెలు, సబ్బులు, టూత్‌పేస్టుల మీద ప్రస్తుతం 28% ఉన్న పన్ను జీఎస్టీతో 18%కు తగ్గుతుంది. మొత్తం 1,211 రకాల వస్తువుల మీద ఎంతెంత పన్ను విధించాలన్న విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఒక కీలక సమావేశంలో నిర్ణయించింది. 81% వస్తువులు 18% కంటే తక్కువ పన్ను పరిధిలోకే వస్తాయని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆది చెప్పారు. జీఎస్టీలోని ఏడు నిబంధనలను కౌన్సిల్ ఆమోదించిందిని, మిగిలిన రెండింటిటిని మాత్రం ఒక లీగల్ కమిటీకి నివేదించామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశమై సేవల మీద రేట్ల గురించి చర్చిస్తుంది. పన్ను నుంచి పూర్తిగా మినహాయించే వస్తువులు ఏవేంటన్న విషయాన్ని శుక్రవారం నాడు ఖరారుచేస్తామని, అలాగే బంగారం, బీడీల మీద పన్ను గురించి కూడా చర్చిస్తామని జైట్లీ అన్నారు.