పాలు, ఆహారధాన్యాలపై పన్ను ఎత్తివేత | milk and food grains exumpted from gst, several rates to come down | Sakshi
Sakshi News home page

పాలు, ఆహారధాన్యాలపై పన్ను ఎత్తివేత

Published Thu, May 18 2017 7:21 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

పాలు, ఆహారధాన్యాలపై పన్ను ఎత్తివేత

పాలు, ఆహారధాన్యాలపై పన్ను ఎత్తివేత

జీఎస్టీ రేట్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇవి సామాన్యుడికి ఉపయోగపడే రీతిలోనే కనిపిస్తున్నాయి. జీఎస్టీ పుణ్యమాని ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు చాలావరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. పాలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించారు. అంటే, పాల అమ్మకాల మీద ఇకమీదట ఎలాంటి పన్ను ఉండబోదు. అలాగే ఆహార ధాన్యాలు కూడా ధరలు తగ్గుతాయి. వాటిమీద ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా, జీఎస్టీని వాటికి కూడా పూర్తిగా మినహాయించారు. బొగ్గు మీద ప్రస్తుతం 11.69% పన్ను ఉండగా, జీఎస్టీని 5%కు పరిమితం చేశారు. అలాగే పంచదార, టీ, కాఫీ, వంటనూనెల మీద కేవలం 5% పన్ను మాత్రమే పడుతుంది. దాదాపు 60 శాతం వరకు వస్తువులు 12-18% శ్లాబు పరిధిలోకే వస్తున్నాయి. తలనూనెలు, సబ్బులు, టూత్‌పేస్టుల మీద ప్రస్తుతం 28% ఉన్న పన్ను జీఎస్టీతో 18%కు తగ్గుతుంది. 
 
మొత్తం 1,211 రకాల వస్తువుల మీద ఎంతెంత పన్ను విధించాలన్న విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఒక కీలక సమావేశంలో నిర్ణయించింది. 81% వస్తువులు 18% కంటే తక్కువ పన్ను పరిధిలోకే వస్తాయని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ ఆది చెప్పారు. జీఎస్టీలోని ఏడు నిబంధనలను కౌన్సిల్ ఆమోదించిందిని, మిగిలిన రెండింటిటిని మాత్రం ఒక లీగల్ కమిటీకి నివేదించామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశమై సేవల మీద రేట్ల గురించి చర్చిస్తుంది. పన్ను నుంచి పూర్తిగా మినహాయించే వస్తువులు ఏవేంటన్న విషయాన్ని శుక్రవారం నాడు ఖరారుచేస్తామని, అలాగే బంగారం, బీడీల మీద పన్ను గురించి కూడా చర్చిస్తామని జైట్లీ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement