తాండూరులో 8 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత
తాండూరు(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా తాండూరులో సారా తయారీకి ఉపయోగించే 8 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రంలోని కూరగాయల బజారులో ఓ దుకాణంలో పోలీసులు సోమవారం తనిఖీలు చేయగా 8 క్వింటాళ్ల నల్లబెల్లంతో పాటు 10కేజీల నమసారం బయటపడింది. దీంతో దుకాణం యాజమాని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.