భర్తను ఐరన్ రాడ్తో కొట్టి చంపిన భార్య
కరీంనగర్ : దంపతుల మధ్య తరచూ చోటు చేసుకునే చిన్నపాటి ఘర్షణ భర్త హత్యకు దారి తీసింది. దాంతో తాళి కట్టిన భర్తను... భార్య ఐరన్ రాడ్తో దారుణంగా కొట్టి చంపింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఐడీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.