చెరువులపై ఆయిల్ ఇంజిన్లు చోరీ
గుడిపాడు(పెదపాడు) : గుడిపాడు గ్రామంలో చేపల చెరువుల వద్ద నీళ్లు తోడే ఆయిల్ ఇంజిన్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ముంగర శ్రీకృష్ణ పరమాత్మ చెరువు వద్ద రామిలేరు గట్టుపై నీరుతోడేందుకు రెండు మోనోబ్లాకు ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇంజిన్ పైపులను మూడు రోజుల క్రితం దొంగలు కత్తిరించి రెండు మోటార్లను ఎత్తుకుపోయారు. దీంతోపాటు జయమంగళ రామ్మోనరావుకు చెందిన మోటార్ పైపులు కత్తిరించి ఇంజిన్ ఎత్తుకు వెళ్లేందుకు యత్నించారు. అయితే ఆయిల్ ఇంజిన్ మాత్రం ఇక్కడే వదిలేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.