Gudumba Manufacturers
-
బెల్లం మూటలతోనే తెగిన ఓహెచ్ఈ తీగ
కేసముద్రం: ప్రయాణిస్తున్న రైలులో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బెల్లం మూటలు విసరడంతోనే కేసముద్రం–ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య గురువారం రాత్రి ఓహెచ్ఈ తీగ తెగిపోయి, పలు రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడినట్లు రైల్వేశాఖ పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు జరిగిన ఘటనపై రైల్వే పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. కేసముద్రం–ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్ఈ తీగ తెగిన ఘటనతో కొల్హాపుర్తోపాటు పలు రైళ్లు ఎక్కడికక్కడ గంటల తరబడి నిలిచిపోవడం, మరికొన్ని రైళ్లను దారి మళ్లించడం, కొన్ని రైళ్లను రద్దుచేసిన విషయం విదితమే. మొత్తంగా ఈ ఘటనతో రైల్వేశాఖకు తీవ్ర నష్టం వాటిళ్లడంతోపాటు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు.. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు విచారణ చేపట్టారు. కొల్హాపుర్ ఎక్స్‌ప్రెస్ కంటే ముందుగా వెల్లిన ఓ ఎక్స్‌ప్రెస్ రైళ్లో నుంచి బెల్లం మూటలు విసరడం వల్ల స్తంభానికి బలంగా తాకి ఊగడంతో ఓహెచ్ఈ తీగ తెగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఘటనా స్థలం చుట్టుపక్కల శనివారం రైల్వేపోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ట్రాక్‌పక్కన బెల్లం ముద్దలు, చిరిగిన బస్తా లభ్యమైంది. దీంతో ఓహెచ్ఈ తీగ తెగడానికి బెల్లం మూటలు విసరడమే కారణమని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. తండాల్లో కౌన్సెలింగ్ కేసముద్రం–ఇంటికన్నె మధ్య ఓహెచ్ఈ తీగ తెగిన ఘటనపై శనివారం మండలంలోని గిర్నితండా, ఎన్టీఆర్ నగర్, కాలనీతండాల్లో ఎక్సైజ్‌శాఖ, ఆర్పీఎఫ్ , ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు తండావాసులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ మేరకు 30 కేజీల బెల్లం, 2 లీటర్ల గుడుంబా, 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. రైళ్లల్లో నుంచి బెల్లంమూటలు విసరడం వల్ల స్తంభాలకు తాకి ఓహెచ్ఈ తీగలు తెగిపోయి, ప్రమాదాలు వాటిల్లే పరిస్థితి ఉందని రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇకనైనా రైళ్లలో నుంచి బెల్లం రవాణ చేయడం, గుడుంబా తయారీ మానుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్పీఎఫ్ ఏఎస్సై నరేందర్, ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై జయశ్రీ, ఎన్పోర్స్మెంట్ ఎస్సై భిక్షపతి, డీటీఎఫ్ కుమారస్వామి పాల్గొన్నారు. -
ఎక్సైజ్ అధికారులపై దాడి
కళ్లల్లో కారం చల్లి రాళ్లతో దాడి చేసిన గుడుంబా విక్రేతలు ఎస్ఐతోపాటు ఇద్దరికి గాయాలు ఆరుగురు నిందితుల అరెస్టు.. పరారీలో మరో ఇద్దరు హైదరాబాద్, న్యూస్‌లైన్: గుడుంబా స్థావరాలపై దాడులు చేయడానికి వెళ్లిన ఎక్సైజ్ అధికారులపై గుడుంబా విక్రేతలు ఎదురుదాడికి దిగారు. కళ్లల్లో కారం చల్లి, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనతో భీతిల్లిన ఎక్సైజ్ అధికారులు ప్రా ణాలు అరచేతిలో పెట్టుకుని తలో దిక్కుకు పరుగులు తీశా రు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, మలక్‌పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రేణుక, నారాయణగూడ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో మంగళవారం ఈ దాడులు జరిగాయి. సరూర్‌నగర్ ఎక్సైజ్ ఎస్ఐ రాం గోపాల్ ఆధ్వర్యంలోని 8 మంది సిబ్బంది సింగరేణికాలనీలో గుడుంబా విక్రయిస్తున్న వెంకట్రాం ఇంటిపై దాడి చేసి పెద్ద ఎత్తున గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకునే సమయంలో కొందరు మహిళల ను ఎస్ఐపైకి వెంకటరాం ఉసిగొల్పాడు. దీంతో వారు కారం తీసుకొచ్చి ఎస్ఐ కళ్లలో చల్లి, రాళ్లతో దాడి చేశారు. మరో ఇద్దరు సిబ్బందిని గాయపరిచి, జీపు అద్దాలు పగలగొట్టారు. మళ్లీ వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మిగతా సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకుని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన శాంతి, సుగుణ, పద్మ, మోతి, హర్యా, కె.శాంతిలను అరెస్ట్ చేశామని, మరో మహిళ విజయలక్ష్మితోపాటు వెంకట్రాం పరారైయ్యారని సైదాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. -
ఎక్సైజ్ సిబ్బంది కళ్లల్లో కారంకొట్టి, రాళ్లతో దాడి
మొన్నటికి మొన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకం మరవకముందే .. ఇవాళ అటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో అక్రమ గుడుంబా వ్యాపారం జరుగుతోంది. ఈ విషయం తెల్సుకుని అక్కడికి చేరుకున్న మలక్‌పేట్ సరూర్‌నగర్ ఎక్సైజ్ సిబ్బందిపై గుడుంబా వ్యాపారులు రెచ్చిపోయి ఎదురుదాడికి దిగారు. ఎస్ఐ రామ్‌గోపాల్, కానిస్టేబుల్ కళ్లల్లో కారంకొట్టి, రాళ్లతో దాడి చేశారు. దీంతో వారు తీవ్రగాయాలపాలయ్యారు.