గుడుంబాపై ఉక్కుపాదం మోపుదాం
- పీడీఎఫ్ అక్రమార్కులను జైలుకు పంపుతాం
- 2018లో వ్యవసాయానికి 24 గంటల కరెంట్
- మానేరు వాగుపై రూ.50 కోట్లతో వంతెన
- వేగురుపల్లి-వావిలాల మధ్య ఐదు చెక్‌డ్యాంలు
- ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్
శంకరపట్నం/మానకొండూర్ : రాష్ట్రంలో గుడుంబా తయూరీ, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టక ముందే ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయన్నారు. గుడంబాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుందని, దీనికి ప్రతిపక్షాలతో పాటు ప్రజల సహకారం అవసరమని కోరారు. గురువారం ఆయన మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గుడుం బాకు బానిసై చిన్నతనంలోనే కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. ప్రజా పంపిణీ సరుకులను పక్కదారి పట్టించే వారిని ఉపేక్షించేలేదని, అధికారి అరుునా, ప్రజాప్రతినిధి అరుునా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. 2018 నాటికి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి తీరుతామన్నారు. మరో మూడేళ్లల్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఆయకట్టు అంతటికీ సా గునీరు అందిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తామని, లేనిపక్షంలో ఓట్లు అడగబోమని చెప్పారు. వేగురుపల్లి మానేరు వాగుపై రూ.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని చెప్పారు. మానేరు వాగుపై వావిలాల వరకు ఐదు చెక్‌డ్యాంలు నిర్మిస్తామన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కేజీ టు పీజీ విద్య కోసం మోడల్ స్కూళ్లను అనుసంధానించనున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే రసమరుు బాలకిషన్‌తోపాటు ఆయూ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.