భద్రత దృష్ట్యానే పలు ఆంక్షలు: డీజీపీ రాముడు
గుంటూరు(మంగళగిరి): గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఫైరింగ్రేంజ్, సీఎం గెస్ట్ హౌస్‌లను రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భద్రతా కారణాల దృష్ట్యానే గెస్ట్‌హౌస్ ప్రాంతంలో పలు ఆంక్షలు విధించినట్టు చెప్పారు. స్థానికులు అర్థం చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోనే ఏకైక ఫైరింగ్ రేంజ్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని చెప్పారు. ఫైరింగ్ రేంజ్‌ను తరలించనున్నారనే వార్తలపై ఆయన స్పందించారు. ఫైరింగ్ రేంజ్ దెబ్బతినకుండా వాహనాల పార్కింగ్, పరిపాలన బ్లాక్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.