బయటపడని డెత్ సీక్రెట్స్
పరకాల : వరుస మరణాలు.. వాటికి అంతుచిక్కని కారణాలు.. హత్యా ? ఆత్మహత్యా ? అనేది తేల్చలేని సందిగ్ధత. ఈ కేసులను ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు అన్నిదారులు మూసుకుపోతున్నారుు. ఇటీవల చోటుచేసుకున్న అనేక అనుమానాస్పద మరణాల్లో మిస్టరీ వీడడం లేదు. వారి డెత్ సీక్రెట్స్ వెల్లడి కావడం లేదు. ఇటీవల రెండు కేసులు ఓ కొలిక్కి వచ్చినప్పటికీ మరో మూడు కేసుల్లో మిస్టరీ వీడలేదు. మండలవ్యాప్తంగా ఈ మిస్టరీ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
పైడిపల్లిలో నర్సమ్మ...
మండలంలోని నాగారం శివారు పైడిపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల నర్సమ్మ(81) జనవరి 21న దారుణ హత్యకు గురైంది. పట్ట పగలు ఆమెను ఇంట్లోనే హత్య చేసి మెడలోని బండారు గొలుసు, చేతికి ఉన్న బంగా రు గాజులను అపహరించారు. అప్పట్లో నర్సమ్మ మృతి గ్రామంలో సంచలనం సృష్టించింది. పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి నేటికి నిందితులను గుర్తించలేకపోయారు.
పులిగిల్లలో లక్ష్మి
మండలంలోని పులిగిల్లలో స్వాతంత్య్ర సమరయోధురాలు వెల్ధండి లక్ష్మి(82) కట్టెల కోసం వెళ్లి మృత్యువాతపడింది. సాయంత్రం బయటకు వెళ్లిన ఆమె వరికోల్ రోడ్డులోని పత్తి చేనులో ఫిబ్రవరి 13న శవమై కన్పించింది. ఆమె తలకు గాయాలు ఉండడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీపీ తగ్గిపోవడంతో కిందపడి చనిపోయినట్లుగా నిర్ధారించారు.రాయపర్తిలో తల్లికుమారుడుమండలంలోని రాయపర్తిలో కిన్నెర రమ(22), 9 నెలల బాబు చింటు బావిలో పడి ఈ నెల 8న ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త తిరుపతి వేధింపులు తట్టులేక రమ తన కుమారుడితో బావిలో దూకిందా లేక తిరుపతే బలవంతంగా బావిలోకి తోశాడా ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తమ కూతురును అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.