Gulen
-
9000 మంది పోలీసుల తొలగింపు
అంకారా (టర్కీ): ఏకంగా తొమ్మిది వేల మంది పోలీసులను టర్కీ ప్రభుత్వం తొలగించింది. గతేడాది జూన్‌లో టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదుర్ఘటనకు ప్రధానకారకుడు వ్యాపార వేత్త గులెన్ అని టర్కీ ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో గులెన్‌పై చర్యలు తీసుకోవలని టర్కీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా గులెన్‌తో సంబంధాలు ఉన్న 9000 మంది పోలీసులను గుర్తించి వారిని విధులనుంచి తొలగించింది. బుధవారం వెయ్యి మందిపైగా గులెన్ సానుభూతి పరులని గుర్తించి అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. పోలీసు శాఖలో అవినీతి నిర్మూలనలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జింహువా అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. జులై 16 సైనిక తిరుగుబాటుకు గులెన్ ప్రధానకారకుడు. కొన్ని దశాబ్దాలుగా పలు దేశాల్లో వ్యాపార, మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. 2013 నుంచి అమెరికాలో అజ్ఞాతంలో గడుపుతున్నాడు. గులెన్ను అప్పగించాలని టర్కీ అమెరికాను ఇప్పటికే పలు సార్లు కోరింది. -
గులెన్ సంస్థలను పాక్ మూసేయనుందా..
ఇస్లామాబాద్: టర్కీలో సైనిక తిరుగుబాటుకు ప్రధానసూత్రధారిగా భావిస్తున్న గులెన్‌పై చర్యలు తీసుకోవలని టర్కీ ప్రభుత్వం పాకిస్తాన్‌ను కోరింది. పాకిస్తాన్లో గులెన్ నిర్వహిస్తున్న సంస్థలు, వ్యాపారాలను మూసివేయాలని టర్కీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టర్కీ రాయబారి సాదిక్ బాబర్ గిర్గిన్.. పాక్‌ను కోరినట్లు మీడియా సంస్థ 'డాన్' వెల్లడించింది. జులై 16 సైనిక తిరుగుబాటుకు ప్రధానకారకుడు గులెన్ అని నిరూపించే ఆధారాలు టర్కీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని సాదిక్ వెల్లడించారు. గులెన్కు సంబంధించిన కార్యకలాపాలను తమ దేశాల్లో నిర్వహించకుండా చూడాలని టర్కీ మిత్రదేశాలన్నింటినీ కోరుతున్నట్లు సాదిక్ తెలిపారు. పాకిస్తాన్‌తో తమకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా సాదిక్ గుర్తుచేశారు. 2013 నుంచి అమెరికాలో అజ్ఞాతంలో గడుపుతున్న గులెన్ను అప్పగించాలని టర్కీ అమెరికాను కోరుతున్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా గులెన్ పాకిస్తాన్లో వ్యాపార, మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. అయితే టర్కీ విన్నపాన్ని పాక్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి మరి!