ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
న్యూయార్క్: ఫేస్బుక్, సెల్ఫీ.. జీవితంలో ఓ భాగమయ్యాయి. ఇవి ఎంత అవసరమో అంతే వరకే ఉపయోగించాలి. వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఫేస్బుక్లో స్నేహితులను ఆకట్టుకోవడం కోసం ఓ వ్యక్తి దుస్సాహసానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
మెక్సికోకు చెందిన ఆస్కార్ ఒటిరో అనే యువ వెటర్నరీ డాక్డర్ బుల్లెట్లు నింపిన తుపాకీ దగ్గరగా పెట్టుకుని ఫొటో దిగాలని సరదాపడ్డాడు. తుపాకీని తలకు దగ్గర పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ (తమను తామే ఫోటొ) తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో తలలోకి బుల్లెట్ తీసుకెళ్లింది. అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఆస్కార్‌కు అందమైన అమ్మాయిలను కొగిలించుకోవడం, మోటార్ బైక్‌లపై విన్యాసాలు చేయడం, వేగంగా వెళ్తున్ కార్ల ముందు ఫొటోలు దిగడం సరదా. ఆ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసేవాడు. ఈ సరదానే అతని ప్రాణం తీసింది.