The gun
-
సినీఫక్కీలో యువకుడి వీరంగం
నాటు తుపాకీతో బెదిరింపు పోలీస్‌ల అదుపులో నిందితుడు విడవలూరు : ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఇరువర్గాలు మోహరించడంతో అందులో ఓ యువకుడు నాటు తుపాకీతో సినీఫక్కీలో వీరంగం సృష్టించాడు. ఉద్రిక్తతలకు దారి తీసిన , సంచలనం సృష్టించిన ఈ సంఘటన మండలంలోని చౌకచెర్లలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన కొమ్మిరెడ్డి నరేంద్రరెడ్డికి చౌకచెర్లలో 19 ఎకరాల పట్టా భూమి ఉంది. దీన్ని గ్రామంలోని తన బంధువైన కొమ్మిరెడ్డి మురళీకృష్ణారెడ్డికి 2004లో కౌలు కింద అప్పగించారు. ఆ సమయంలో నరేంద్రరెడ్డి రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 12 ఏళ్ల కిత్రం తీసుకున్న అప్పు నేడు వడ్డీతో కలిపి దాదాపు రూ.50 లక్షల వరకు పెరిగి పోయింది. ప్రస్తుతం ఉన్న అప్పులో రూ.30 లక్షలు అయినా చెల్లించాలని మురళీకృష్ణారెడ్డి పలు మార్లు నరేంద్రరెడ్డిని కోరాడు. దీనికి ఆయన సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం నరేంద్రరెడ్డికి ఉన్న 19 ఎకరాల పొలం కోత దశకు చేరుకుంది. దాన్ని కోసేందుకు వారం రోజులుగా నరేంద్రరెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మురళీకృష్ణారెడ్డి, స్థానికులతో కలిసి తన అప్పులో కొంతభాగమైన చెల్లించి వరి కోసుకోవచ్చునని అడ్డుపడుతున్నారు. దీంతో నరేంద్రరెడ్డి ఎలాగైనా పంట కోసుకుపోవాలని పూర్తి బందోబస్తుతో శుక్రవారం పొలం వద్దకు చేరుకున్నాడు. మూడు వరికోత యంత్రాలను, ఇందుకూరుపేట మండలం మైపాడు, కుడితిపాళెం, నెల్లూరుకు చెందిన దాదాపు 100 మంది యువకులను తీసుకువచ్చాడు. వీరిలో నెల్లూరుకు చెందిన వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా ఉండటం గమన్హారం. విషయం తెలుసుకున్న మురళీకృష్ణారెడ్డి, గ్రామస్తులు దాదాపు 150 మంది సంఘటన స్థలం వద్దకు చేరుకుని వరి కోత యంత్రాలను అడ్డుకున్నారు. దీంతో నరేంద్రరెడ్డి తనతో వచ్చి యువకులను రెచ్చగొట్టి గ్రామస్తులపైకి ఉసిగొల్పాడు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. అదే సమయంలో నరేంద్రరెడ్డితో వచ్చిన యవకుల్లో నెల్లూరుకు చెందిన బాబు అనే వ్యక్తి తన వద్దనున్న నాటు తుపాకీ, కత్తిని బయటకు తీసి గ్రామస్తులను బెదిరించాడు. కత్తితో దాడికి పాల్పడడంతో తప్పించుకునే ప్రయత్నంలో గ్రామానికి చెందిన స్టాలిన్ అనే వ్యక్తి చొక్కా చినిగిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కాల్చిచంపుతానంటూ సినీఫక్కిలో, మాఫియా తరహాలో స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. అయితే స్థానికులు ధైర్యంగా నిలబడటంతో అతను వెనక్కితగ్గాడు. గ్రామస్తులు పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ వెంకట్రావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారు పరారయ్యారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో నరేంద్రరెడ్డి కారణంగా అలజడి రేగడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌లు తెలిపారు. -
నగరంలో తుపాకీ మోతలివే..
బంజారాహిల్స్:జూబ్లీహిల్స్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దోపిడీ దొంగల ముఠా గురువారం కాల్పులకు దిగడం పోలీసులను షాక్‌కు గురి చేసింది. నగరంలో హంతకులు, దోపిడీ దొంగలు, చైన్ స్నాచర్లు, స్వైర విహారం చేస్తూ పోలీసులకు సవాల్‌గా మారారు. ముఖ్యంగా సంపన్నులు నివసించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కాల్పుల మోత వీవీఐపీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఏడాది నవంబర్ 19న బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వచ్చిన పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కానిస్టేబుల్ ఓబులేషు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకకు చెందిన దోపిడీ దొంగల ముఠా పోలీసుల పైకే రివాల్వర్ ఎక్కుపెట్టింది. జూబ్లీహిల్స్‌లో ముగ్గురు దొంగలను పట్టుకునే యత్నంలో జరిగిన కాల్పుల్లో ఓ కూలీ గాయపడ్డాడు. గతంలోని కాల్పుల ఘటనలు... బంజారాహిల్స్‌లోని గ్రీన్‌మాస్క్ వద్ద రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఓ రియల్టర్‌పై కాల్పులు జరిగాయి. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ సమీపంలోని ఒక వైద్యుడి ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలను వైద్యుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో కాల్చారు.జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో 2004 జూన్ 3న నిర్మాత బెల్లకొండ సురేష్, సత్యనారాయణ చౌదరిలపై కాల్పులు జరిగాయి.ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరిపై అతని అనుచరుడు భానుకిరణ్ 2011 జనవరి 2న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నవోదయ కాలనీలో రివాల్వర్‌తో కాల్చి.. హతమార్చాడు.జూబ్లీహిల్స్ రోడ్ నెం.57లోని నందగిరిహిల్స్ సమీపంలో మాఫీయా డాన్ అజీజ్‌రెడ్డిని ఎన్కౌంటర్లో పోలీసులు కాల్చి చంపారు. -
పెద్దాస్పత్రిలో పిస్తోల్ కలకలం
మహిళపై తపంచాతో దాడికి యత్నం అగంతకుడిని పట్టుకున్న ఔట్‌పోస్ట్ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది కొనసాగుతున్న విచారణ గతంలో పేలిన టిఫిన్ బాంబు ఏళ్లు గడిచినా పూర్తి కాని విచారణ తాజా ఘటనతో భయూందోళనలో రోగులు ఎంజీఎం : ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానకంగా నిలుస్తూ... వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న మహాత్మగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో తుపాకీ కలకలం సృష్టించింది. నిత్యం వందలు, వేల సంఖ్య లో రోగులు వచ్చే ధర్మాస్పత్రిలో ఓ అగంతకుడు తపంచాతో ప్రత్యక్షం కావడంతో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఎనిమిదేళ్ల కిత్రం ఎంజీఎం ఆస్పత్రిలోని ఓపీ బ్లాక్ వద్ద టిఫిన్ బాంబ్ పేలి కలకలం సృ ష్టించింది. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ మృత్యువాత పడకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనను అధికారులు తీవ్రంగా పరిగణించినప్పటికీ... విచారణ మూలకు పడింది. తాజాగా బుధవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఎంజీఎంలో ఆస్పత్రిలో ప్రాంగణంలోని ఓ అగంతకుడి బ్యాగ్‌లో తపంచా ప్రత్యక్షం కావడంతో అసాంఘిక శక్తులకు ధర్మాస్పత్రి కేంద్రంగా మారిందనే భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. తపంచాతో పట్టుబడ్డ అంగతకుడు... ఎంజీఎం ఆస్పత్రిలో ఓపీ విభాగం వద్ద ఉన్న చెట్ల కింద రోగుల అటెండెంట్లు రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటారు. బుధవారం రాత్రి ఓ మహిళ కేకలు వేయడంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు మహిళపైదాడి చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. మారణాయుధాలతో బెదిరించినట్లు గ్రహించిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్న వారి బ్యాగ్‌లను తని ఖీ చేశారు. ఈ సమయంలో ఓ అగంతకుడి బ్యాగ్‌లో నుంచి తపంచా ప్రత్యక్షమైంది. సదరు వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. మట్టెవాడ పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. ఏసీపీ సురేంద్రనాథ్ అక్కడికి చేరుకుని ఆ అగంతకుడిని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై పోలీసులను సంప్రదించగా.. ‘పూర్తి స్తాయి విచారణ జరుగుతుందని.. ఆనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని వారు సమాధానమిచ్చారు. అరుుతే ఆ అంగతకుడు ఎంజీఎం ఆస్పత్రిలో ఓ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళ కోసం వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. సదరు మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పట్టించుకునే నాథుడే లేరు.. ఎంజీఎం ఆస్పత్రిలో పేరుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. వాటి ద్వారా చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. ఆస్పత్రిలో కొన్ని నెలల నుంచి ద్విచక్ర వాహనాల దొంగతనాలు సైతం జరుగుతున్నారుు. అరుునా... పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. రాత్రివేళలో ఓపీ బ్లాక్ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఎంజీఎం పరిపాలనాధికారులు, పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి ఎంజీఎం ఆస్పత్రిపై ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు. -
టీచర్ల వీరంగన్
‘‘చిన్నవాడి చేతిలోన గన్ను... పేలినదా చంపేను నన్ను’’ అంటూ ఆ స్కూలు స్కూలంతా గజగజ వణికిపోయింది. ఇంగ్లండ్‌లోని సోమర్సెట్, ఫ్రోమ్ ప్రాంతంలో ఉన్న సెల్‌వుడ్ అకాడమీ స్కూల్ చాలా స్ట్రిక్ట్ రూల్స్‌తో నడుస్తుంది. ఆ స్కూల్లో జేడాన్ అనే పదేళ్ల కుర్రాడు చదువుతున్నాడు. గత 27న ఆ కుర్రాడు తరగతి గదిలోకి చేతిలో తుపాకీతో ప్రవేశించాడు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో టీనేజర్లు పిస్తోలుతో వీరంగాలు వేసి, సంచలనం సృష్టించిన నేపథ్యంలో జేడాన్ చేతిలో తుపాకీ చూసిన సెల్‌వుడ్ స్కూల్ టీచర్లు చలి జ్వరం వచ్చినట్టు వణికిపోయారు. ముగ్గురు టీచర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాఠశాల నుంచి జేడాన్ని సస్పెండ్ చేసేశారు. పోలీసు అధికారులు జేడాన్ ఇంటికి వచ్చి మరీ కౌన్సిలింగ్ నిర్వహించారు. మార్చి 9 దాకా జేడాన్ ఇల్లు విడిచి బయటకు వెళ్లకూడదని ఓ రకంగా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంతో జేడాన్ తల్లి నటాషా డిప్రెషన్లోకి వెళ్లి మంచమెక్కింది. ఇంతా చేస్తే జేడాన్ తీసుకెళ్లింది బొమ్మ తుపాకీయే. ఈ విషయాన్ని చెప్పిన జేడాన్ సవతి తండ్రి... ‘‘పెద్దగా శబ్దం కూడా చేయని ప్లాస్టిక్ తుపాకీని కారణంగా చూపి ఇంటికి పోలీసులు రావడం, మా అబ్బాయికి కాల్పుల మీద క్లాస్ తీసుకోవడం, స్కూల్ నుంచి సస్పెండ్ చేయడం న్యాయం కాదని, వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలని’’ వేడుకుంటున్నాడు. జేడాన్ గతంలో మంచి ప్రవర్తనకు గాను అవార్డు కూడా అందుకున్నాడని గుర్తు చేస్తున్నాడు. సత్యవర్షి