పెద్దాస్పత్రిలో పిస్తోల్ కలకలం
మహిళపై తపంచాతో దాడికి యత్నం
అగంతకుడిని పట్టుకున్న ఔట్‌పోస్ట్
పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది
కొనసాగుతున్న విచారణ
గతంలో పేలిన టిఫిన్ బాంబు
ఏళ్లు గడిచినా పూర్తి కాని విచారణ
తాజా ఘటనతో భయూందోళనలో రోగులు
ఎంజీఎం : ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానకంగా నిలుస్తూ... వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న మహాత్మగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో తుపాకీ కలకలం సృష్టించింది. నిత్యం వందలు, వేల సంఖ్య లో రోగులు వచ్చే ధర్మాస్పత్రిలో ఓ అగంతకుడు తపంచాతో ప్రత్యక్షం కావడంతో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఎనిమిదేళ్ల కిత్రం ఎంజీఎం ఆస్పత్రిలోని ఓపీ బ్లాక్ వద్ద టిఫిన్ బాంబ్ పేలి కలకలం సృ ష్టించింది. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ మృత్యువాత పడకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనను అధికారులు తీవ్రంగా పరిగణించినప్పటికీ... విచారణ మూలకు పడింది. తాజాగా బుధవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఎంజీఎంలో ఆస్పత్రిలో ప్రాంగణంలోని ఓ అగంతకుడి బ్యాగ్‌లో తపంచా ప్రత్యక్షం కావడంతో అసాంఘిక శక్తులకు ధర్మాస్పత్రి కేంద్రంగా మారిందనే భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి.
తపంచాతో పట్టుబడ్డ అంగతకుడు...
ఎంజీఎం ఆస్పత్రిలో ఓపీ విభాగం వద్ద ఉన్న చెట్ల కింద రోగుల అటెండెంట్లు రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటారు. బుధవారం రాత్రి ఓ మహిళ కేకలు వేయడంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు మహిళపైదాడి చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. మారణాయుధాలతో బెదిరించినట్లు గ్రహించిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్న వారి బ్యాగ్‌లను తని ఖీ చేశారు. ఈ సమయంలో ఓ అగంతకుడి బ్యాగ్‌లో నుంచి తపంచా ప్రత్యక్షమైంది. సదరు వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. మట్టెవాడ పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. ఏసీపీ సురేంద్రనాథ్ అక్కడికి చేరుకుని ఆ అగంతకుడిని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై పోలీసులను సంప్రదించగా.. ‘పూర్తి స్తాయి విచారణ జరుగుతుందని.. ఆనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని వారు సమాధానమిచ్చారు. అరుుతే ఆ అంగతకుడు ఎంజీఎం ఆస్పత్రిలో ఓ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళ కోసం వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. సదరు మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
పట్టించుకునే నాథుడే లేరు..
ఎంజీఎం ఆస్పత్రిలో పేరుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. వాటి ద్వారా చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. ఆస్పత్రిలో కొన్ని నెలల నుంచి ద్విచక్ర వాహనాల దొంగతనాలు సైతం జరుగుతున్నారుు. అరుునా... పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. రాత్రివేళలో ఓపీ బ్లాక్ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఎంజీఎం పరిపాలనాధికారులు, పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి ఎంజీఎం ఆస్పత్రిపై ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.