నగరంలో తుపాకీ మోతలివే..
బంజారాహిల్స్:జూబ్లీహిల్స్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దోపిడీ దొంగల ముఠా గురువారం కాల్పులకు దిగడం పోలీసులను షాక్‌కు గురి చేసింది. నగరంలో హంతకులు, దోపిడీ దొంగలు, చైన్ స్నాచర్లు, స్వైర విహారం చేస్తూ పోలీసులకు సవాల్‌గా మారారు. ముఖ్యంగా సంపన్నులు నివసించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కాల్పుల మోత వీవీఐపీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఏడాది నవంబర్ 19న బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వచ్చిన పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కానిస్టేబుల్ ఓబులేషు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకకు చెందిన దోపిడీ దొంగల ముఠా పోలీసుల పైకే రివాల్వర్ ఎక్కుపెట్టింది. జూబ్లీహిల్స్‌లో ముగ్గురు దొంగలను పట్టుకునే యత్నంలో జరిగిన కాల్పుల్లో ఓ కూలీ గాయపడ్డాడు.
గతంలోని కాల్పుల ఘటనలు...
బంజారాహిల్స్‌లోని గ్రీన్‌మాస్క్ వద్ద రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఓ రియల్టర్‌పై కాల్పులు జరిగాయి. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ సమీపంలోని ఒక వైద్యుడి ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలను వైద్యుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో కాల్చారు.జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో 2004 జూన్ 3న నిర్మాత బెల్లకొండ సురేష్, సత్యనారాయణ చౌదరిలపై కాల్పులు జరిగాయి.ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరిపై అతని అనుచరుడు భానుకిరణ్ 2011 జనవరి 2న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నవోదయ కాలనీలో రివాల్వర్‌తో కాల్చి.. హతమార్చాడు.జూబ్లీహిల్స్ రోడ్ నెం.57లోని నందగిరిహిల్స్ సమీపంలో మాఫీయా డాన్ అజీజ్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌లో పోలీసులు కాల్చి చంపారు.