ఆకాశాన్ని మోసే పక్షి!
చిట్టి కవితలు
- గుండంపాటి విజయసారథి
గది గోడపై
కాలాన్ని మోస్తూ క్యాలెండర్
కాలాన్ని మేస్తూ గడియారం
''
హేమంతం
చలికి వణుకుతూ
నక్షత్రాలు
''
పున్నమి రాత్రి
నదిలో చేపై
చందమామ
''
ఎండ కాసేపు
చెట్టు నీడలో
విశ్రమించింది
''
ఆకాశానికి
వింజామరలు వీస్తూ
పక్షుల గుంపు
''
రెక్కలు సాచి
ఆకాశాన్ని మోస్తున్న
ఒంటరి పక్షి