ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మార్పు
గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని వాడి–గుంతకల్లు సెక్షన్లో మట్మర్రి–మంత్రాలయం స్టేషన్ల మధ్య డబుల్‌లైన్ పనుల దృష్ట్యా ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మార్పు చేయడంతో పాటు కొన్ని ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం) సీహెచ్ రాకేష్ వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ పనులు చేస్తున్నామన్నారు. ఈ పనుల దృష్ట్యా కోయంబత్తూరు–లోకమాన్యతిలక్ (నంబర్ 11014) ఎక్స్‌ప్రెస్ రైలు కోయంబత్తూరులో ఉదయం 8.50 గంటలకు బదులు మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.
అలాగే మైసూర్–బాగల్‌కోట (17307) ఎక్స్‌ప్రెస్ రైలు మైసూర్లో మధ్యాహ్నం 1.30 గంటలకు బదులు సాయంత్రం 4.15 గంటలకు, యశ్వంతపూర్–బీదర్ (16571) రైలు యశ్వంతపూర్‌లో సాయంత్రం ఏడు గంటలకు బదులు రాత్రి 9.25 గంటలకు, బెంగళూరుసిటీ–న్యూఢిల్లీ (12627) మధ్య తిరిగే కర్ణాటక ఎక్స్‌ప్రెస్ బెంగళూరు సిటీ స్టేషన్లో రాత్రి 7.20 బదులు రాత్రి 9.45 గంటలకు, యశ్వంతపూర్–షోలాపూర్ (22134) ఎక్స్‌ప్రెస్ యశ్వంత్‌పూర్‌లో రాత్రి 8.50 బదులు అర్ధరాత్రి 12.10 గంటలకు, బెంగళూరు–నాందేడ్ (16594) రైలు బెంగళూరులో రాత్రి 10.45 గంటలకు బదులు అర్ధరాత్రి 1.20 గంటలకు బయలుదేరతాయని వెల్లడించారు. అలాగే గుల్బర్గా–గుంతకల్లు (నం–57631/32) మధ్య నడిచే ప్యాసింజర్ రైలు గుల్బర్గా నుంచి రాయచూర్ వరకు మాత్రమే నడుస్తుందన్నారు. గుంతకల్లు–రాయచూర్ (నం–57427/28) ప్యాసింజర్ గుంతకల్లు నుంచి ఆదోని వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. ఈ మార్పులు మూడు రోజులపాటు ఉంటాయని, ప్రయాణికులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.