గుర్రంకొండలో ఎర్ర మూలాలు
► ఎర్రచందనం అక్రవు రవాణాకు గేట్‌వే
► ఇక్కడి నుంచే పెలైట్లు, డ్రైవర్లు
గుర్రంకొండ: ఎర్రచందనం అక్రమ రవాణాకు గు ర్రంకొండ కేంద్రంగా మారుతోంది. ఇక్కడి నుంచే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అవసరమైన పెలైట్లు, వాహనాలకు డ్రైవర్లు వెళుతుండడాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిఘా పెట్టారు. గుర్రంకొండ కడప-జాతీయ రహదారి లో ఉంది. అంతేగాక చిత్తూరు, కడప జిల్లాలకు సరిహద్దుగాకూడా ఉంది. దీంతో పలువురు వ్యక్తు లు ఇక్కడ మకాంవేసి తవు కార్యకలాపాల్ని యుథేచ్ఛగా సాగిస్తున్నారు. గతంలో టి.పసలవాండ్లపల్లె, చెర్లోపల్లె, ఎల్లుట్ల గ్రావూల్లో ఎర్రచందనం దుంగలను డంపింగ్ చేసేవారు. పోలీసులు దాడులుచేసి పలువూర్లు ఎర్రచందనం దుంగల్ని స్వా ధీనం చేసుకున్నారు. అదేవిధంగా బి.కొత్తకోట పోలీసులు ఇటీవల ఎల్లుట్ల పంచాయుతీలోని కల్లూరివాండ్లపల్లెకు చెందిన ఒక వ్యక్తిని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. సరిహద్దు గ్రామాల్లోని ఒకరిద్దరు నాయుకులపైనా కేసులు నమోదయ్యూయి.
ఈ నేపథ్యంలో వుళ్లీ వుండలంలో ఎర్ర కార్యకలాపాలు జోరందుకుంటున్నారుు. ఓ వ్యక్తి గుర్రంకొండలో పలువురిని ఈ కార్యకలాపాల్లోకి దించుతున్నట్లు సవూచారం. వుుఖ్యంగా 22 నుంచి 28 ఏళ్లలోపు యుువకులు, డ్రైవర్లను వినియోగించుకుంటున్నట్టు తెలిసింది. వాహనాలకు వుుందు పైలట్లుగా ద్విచక్ర వాహనాల్లో వెళ్లేందుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. డ్రైవర్లకు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారు. సువూరు 25 వుంది వరకు ఈ పనుల్లో పాల్గొంటున్నట్టు విశ్వనీయ సమాచారం. కొంతవుంది రిటైర్డ్ పోలీసులు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని ఎర్రచందనం స్మగ్లర్లు అప్పుడప్పుడు బెంగళూరు, తిరుపతి, చెన్నై తదితర పట్టణాలకు తీసుకెళ్లి విందులు, విలాసాల్లో వుుంచెత్తుతున్నట్టు సమాచారం.
వీరికి కొంతవుంది నాయుకులు తవు అండదండలు అందిస్తూ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కడప జిల్లాకు చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్రంకొండ వుండలంలోని పలు గ్రావూల్లో దాడులు చేసి కొంతవుంది నాయుకుల్ని విచారణ నిమిత్తం తీసుకెళ్లిన సంఘటనలు చోటుచేసుకున్నారుు.