ఎస్టీలకు అన్యాయం
టవర్‌సర్కిల్ : సాంఘిక సంక్షేమశాఖ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల సీట్ల కేటాయింపుల్లో ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఎరుకల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కావేటి గోపి అన్నారు. ఆదివారం భగత్‌నగర్‌లో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి కౌన్సిలింగ్లో 240 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం 14 సీట్లకు 12 మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. రీకౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కుతాడి శ్రీనివాస్, కట్ట సంపత్, సుల్తాన్ అంజి, కట్ట రవీందర్, కె.అంజి, కట్ట శంకర్, కుర్ర రాజశేఖర్, కుతాడి సంపత్, సార్ల ఆంజనేయులు, లోకిని సంపత్, కుమారస్వామి, బూనాద్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.