గురుకులాల్లో నియామకాలకు ఇంటర్వ్యూలు
భద్రాచలం : జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆరు గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలకు భద్రాచలంలో బుధవారం ఇంటర్వ్యూలులు నిర్వహించారు. గురుకుల సెల్ జిల్లా సమన్వయ అధికారి బురాన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు వీటిని కొనసాగించారు. ఉపాధ్యాయులు, స్టాఫ్‌నర్స్‌లు, ఆర్ట్‌అండ్ క్రాఫ్ట్ టీచర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, ఇంటర్వ్యూలకు పిలిచారు. స్టాఫ్‌నర్సుల భర్తీకి అదనపు డీఎంహెచ్ఓ పుల్లయ్య, భద్రాచలం ఎస్పీహెచ్ఓ డాక్టర్ కోమల తదితరులు ఇంటర్వ్యూలు చేశారు. కాఫ్ట్ టీచర్ల ఎంపిక కోసం సీనియర్ ఉపాధ్యాయులు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు.