వీఆర్ఓ పరీక్షకు ఉచిత అవగాహన తరగతులు
ద్వారకానగర్, న్యూస్‌లైన్ : వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు 23, 24 తేదీల్లో ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు విక్టరీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ జి.వెంకటశివ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2న పరీక్ష నిర్వహించనున్న దృష్ట్యా ప్రశ్నాసరళిపై వివిధ సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ద్వారకానగర్ నాల్గవ లైన్ గాయత్రి కాలేజీ దరి విక్టరీ స్టడీ సర్కిల్లో గానీ, 9246666225 నంబర్‌లోగానీ సంప్రదించాలని కోరారు.
గాయత్రి కాంపిటేటివ్ అకాడమీలో..
వెంకోజీపాలెం : వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ డెరైక్టర్లు ఎస్.వెంకటశ్రీనివాస్, ఎం.శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులు ఈనెల 23 నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని పేర్కొన్నారు. శిక్షణ తరగతులు ద్వారకానగర్ మూడో లైన్‌లోని సంస్థ కార్యాలయంలో జరుగుతాయని తెలిపారు. వివరాలకు 9490263306, 7396449365లో సంప్రదించాలని కోరారు.