కమిషనర్ సుడిగాలి పర్యాటన
సాగర్‌నగర్ : మహా విశాఖనగర కమిషనర్ హరినారాయణన్ మంగళవారం ఆరోవార్డులో క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఆ కాలనీలోకి నేరుగా వెళ్లి అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సాగర్‌నగర్ వుడా కాలనీలోనుంచి ఇటీవ నిర్మించిన గుడ్లవానిపాలెం గెడ్డను పరిశీలించారు. స్థానికంగా పాడైన నుయ్యిను ఆధునీకరించి వాడకలోకి తీసుకు రావాలని దానికి ప్రతిపాదనలు సిద్ధ్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. తర్వాత సాగర్‌నగర్ ఎండాడ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న దసప్పల్లా లేఅవుట్ డ్రై యిన్ పరిశీలించి డ్రై యిన్ వెడల్పు చేయాలని అందుకు అంచనాలు తయారు చేయాలని సూచించారు. తర్వాత ఎండాడ రాజీవ్‌నగర్ కొండవాలు ప్రాంతానికి ప్రధాన రహదారి దుస్థితిని పరిశీలించారు. తక్షణమే దీని ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈ బడే శ్రీరామమూర్తిని ఆదేశించారు. తెలగా ఎండాడ, గొల్లలెండాడల్లో భూగర్భ డ్రై యినేజీలు ఏర్పాటు చేయాలని స్థానికులు కమిషనర్‌ను కోరారు. కాలినడకన తిరిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. అక్కడ నుంచి ఎండాడ చెరువు ఆధునీకరణ పనులను పరిశీలించారు. చెరువు గర్భంలో పూడికలను ఇరిగేషన్‌శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సలహాలు తీసుకుని ఆ శాఖ ద్వారా పనులు చేయించాలని ఈఈని ఆదేశించారు. అక్కడ నుంచి విశాలాక్షినగర్ మెయిన్ రోడ్డు జోడుగుళ్లపాలెం మధ్యన బీచ్ రోడ్డును ఆనుకొని ఉన్న ఖాలీస్థలంతా చిట్టిడవిని తలపిస్తూ భయంకరంగా కన్పిస్తోంది. ఈ ఖాళీస్థలాన్ని కూడా కమిషనర్ పరిశీలించారు. తక్షణమే పేరుకుపోయిన తుప్పలను తొలగించాలని ఆదేశిచడంతో వెంటనే ఏఈఈ శ్రీధర్ ప్రొక్లెయిన్ తెప్పించి పనులు ప్రారంభించారు. జోడుగుళ్లపాలెంలో సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ స్థానికడు ఉమ్మిడి భాస్కర్ వివరించారు. మొత్తం రెండున్న గంటల పాటు వార్డులోని పలు కాలనీల్లో కలియ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గెడ్డలు, డ్రై యిన్లు, రహదారులను మెరుగు పరచాలని, ఎక్కడైనా పెండింగ్ ఉంటే తక్షణమే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. కమిషనర్ వెంట మధురవాడ జోన ల్ ఇన్చార్జి కమిషనర్ లక్ష్మీ, ప్రజావైద్యారోగ్యవిభాగం సూపర్వైజర్ పి. లక్ష్మి, ఇంజినీరింగ్ ఈఈ బడే శ్రీరామమూర్తి, ఏఈఈ పి. భరణికుమార్, శ్రీధర్,మంచినీటి సరఫరా ఏఈఈ మణికుమార్, చెట్టుపల్లి గోపి, ఎండాడ గ్రామాభివద్ధి కమిటీ అధ్యక్షుడు ఉప్పులూరి చినగోపి, వైఎస్సార్సీపీ నాయకుడు మాదు చంటి తదితరులు ఉన్నారు.