ప్రేక్షకులుగా ‘సెక్స్ డాల్స్’.. భారీ జరిమానా
సియోల్ : మైదానాల్లో ప్రేక్షకుల స్థానంలో సెక్స్ డాల్స్‌ను వాడినందుకుగానూ ఎఫ్‌సి సియోల్ క్లబ్‌కి, కే లీగ్ భారీ జరిమానా విధించింది. స్టాండ్స్‌లో బట్టల దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ డాల్స్‌ను వాడి అభిమానుల మనోభావాలను దెబ్బతీసినందుకుగానూ 100 మిలియన్ ఓన్(దాదాపు 61 లక్షల రూపాయలు) భారీ జరిమానాను ఎఫ్‌సి సియోల్ క్లబ్‌కి విధించింది. ('వర్షాకాలం తర్వాతే దేశంలో క్రికెట్ మొదలవ్వొచ్చు')
కరోనా మహమ్మారితో ప్రేక్షకులు లేక క్రీడానిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక కనీసం టీవీల్లోనైనా మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించేవారికి ఫీల్ మిస్సవ్వకుండా ఉండటానికి గ్రౌండ్లో భారీగా అభిమానులు ఉన్నట్టు బొమ్మలతో నింపింది దక్షిణ కొరియాకి చెందిన ఎఫ్‌సి సియోల్ క్లబ్. అయితే ఆ బొమ్మలని సెక్స్ టాయ్స్‌ని తయారు చేసే ఓ సంస్థ సరఫరా చేసింది. గ్వాంగ్జు, ఎఫ్‌సీ-ఎఫ్‌సీ సియోల్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించిన ప్రేక్షకులు ఆ బొమ్మలను చూసి ఆశ్చర్యపోయారు. వాటిలో కొన్ని సెక్స్ డాల్స్ కూడా ఉండటంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్టేడియం స్టాండ్స్‌లో ఖరీదైన షోకేస్ బొమ్మలని పెట్టాలనుకున్నామని, కానీ వాటిని ఉత్పత్తి చేసే సంస్థ చేసిన తప్పిదం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని ఎఫ్‌సి సియోల్ ఫుట్ బాల్ క్లబ్ తెలిపింది. బట్టల దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ డాల్స్‌ను కూడా తెచ్చి, వాటికి తమ టీమ్ టీషర్టులు తొడిగి స్టేడియంలో పెట్టిందని పేర్కొంది. (గందరగోళంలో క్రీడల భవిష్యత్: కశ్యప్)
దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీని బహిష్కరించినప్పటికీ, స్టాండ్స్‌లో ఉన్న కొన్ని బొమ్మలు ఎక్స్ రేటింగ్ ఉన్న వెబ్ సైట్లకి ప్రచారం కల్పిస్తున్నట్టుగా ఉన్నాయి. లైవ్‌లో మ్యాచ్ చూసిన అభిమానులు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. దీంతో, ఎఫ్‌సి సియోల్ క్లబ్ తమ అభిమానులకి క్షమాపణ చెప్పింది. కాగా, ఫిబ్రవరిలో మొదలవ్వాల్సిన 2020 కే లీగ్ ఫుట్ బాల్ మ్యాచ్ కరోనావైరస్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. కాకపొతే, త్వరితగతిన వైరస్‌ని అరికట్టామని చెబుతున్న దక్షిణ కొరియాలో ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే ముందే క్రీడలకి రంగం సిద్ధం అయింది. దీంతో మే 8 వ తేదీన కే లీగ్ మొదలయింది. ఖాళీ స్టేడియం స్టాండ్లతో పాటు, ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్‌లు ధరించి, కరచాలనం చేయకూడదనే నియమం విధించారు. ఉమ్ము వేయడం, చీదడం లాంటివి చేయకూడదని, క్రీడాకారుల మధ్య సంభాషణల్ని కూడా నిషేధించారు. కాగా, ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సియోల్ ఎఫ్‌సీ 1-0తో గ్వాంగ్ఝూపై గెలిచింది. (లాక్డౌన్: విరుష్కల మరో వీడియో వైరల్)