కాంట్రాక్ట్ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రెండు నెలల క్రితం విధుల నుం చి తొలగించడంతో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు ఒకరు మనస్తాపానికిలోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం ఈ సంఘటన జరిగింది. వరంగల్ జిల్లా కొత్తపల్లికి చెందిన గ్యార ఉప్పలయ్య 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
ఉప్పలయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అతను 15 ఏళ్లుగా ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. జీహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని సెవెన్‌హిల్స్ సొసైటీలో విధు లు నిర్వహిస్తున్నాడు. 2 నెలల క్రితం 30 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగిం చారు. ఇలా తొలగించిన కార్మికులంతా గురువారం ఉప్పల్ సర్కిల్ ఇన్చార్జి డీసీ విజయకృష్ణతో మాట్లాడటానికి వచ్చారు. తన చేతుల్లో ఏమీ లేదని ఈ సందర్భంగా డీసీ వారికి చెప్పారు.
దీంతో మనస్తాపానికి గురైన ఉప్పలయ్య సర్కిల్ కార్యాలయ ఆవరణలోనే వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్నాడు. దీనిని గమనించిన తోటి కార్మికులు అరవడంతో ఉప్పల్ పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అగ్గిపుల్లను అంటించుకునే లోపే ఉప్పలయ్య ఒంటిపై నీరుపోసి అదుపులోకి తీసుకున్నారు.
పిల్లలను స్కూల్ నుంచి గె ంటేస్తున్నారు
‘‘రెండు నెలల నుంచి ఇంటి అద్దెకట్టడం లేదు. పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేదు. పిల్లలను స్కూల్ నుంచి గెంటేస్తున్నారు.. ఇంటి యజమాని గిన్నెలు బయటవే స్తానంటున్నాడు.. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాం. 4 రోజులుగా పస్తులుంటున్నాం. ఈ బాధలు తట్టుకోలేక బతకడంకన్నా చావే నయం అనుకున్నా’’
- ఉప్పలయ్య