ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగపురాలోని ఫర్నిచర్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అవి తీవ్రమై పక్కనే ఉన్న మరో రెండు గోదాములకు అంటుకున్నాయి.
దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఐదు ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.10 లక్షల మేర నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.