ప్రతిఒక్కరూ సేవాదృక్పథం అలవర్చుకోవాలి
రాయికల్(షాద్‌నగర్‌రూరల్): ప్రతిఒక్కరూ సేవాధక్పథం అలవర్చుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని తహసీల్దార్ చందర్రావు అన్నారు. కష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఆర్యవైశ్య, అనుబంధసంఘాల ఆధ్వర్యంలో మండల పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద ఉచితంగా అల్పాహారం అందించే కార్యరకమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం వాసవీ, వనితాక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పుష్కరభక్తులకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ చందర్రావు హాజరై‡కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన కష్ణా పుష్కరాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని వసతులను కల్పించిందని అన్నారు. పుష్కరాలకు వెళ్లే భక్తులను దష్టిలో పెట్టుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విట్టదుర్గయ్య, హకీంరాజేష్, విఠ్యాల రామేశ్వర్, కిశోర్గుప్త, శివప్రసాద్, దొంతు పాండురంగయ్య, గందెసురేష్, శశిధర్, మాధవీలత, శ్రీలత, ఎంసానిశ్రీను, పెద్దిరాంమోహన్, శివభాస్కర్, శ్రీనివాస్, నాగిళ్లభవాని, సంతోష్‌బాబు, బాల్‌రాజ్, అనుమారివెంకటయ్య, గోవర్ధన్, సూర్యప్రకాష్, రంగయ్య, వెంకటరమణ, విజయభాస్కర్, చంద్రశేఖర్, సంధ్య, నవలత, శిరీష, శారద తదితరులు పాల్గొన్నారు.