‘హజ్ ఆన్లైన్ దరఖాస్తులకు మంచి స్పందన’
ముంబై: హజ్ యాత్ర దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్ చేయడాన్ని ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఈ ఏడాది యాత్రకు సబ్సిడీ కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. శనివారం ఇక్కడ జరిగిన ఆల్ ఇండియా హజ్ ఉమ్రా టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
2017 హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ జనవరి 2న ప్రారంభమైందని, చివరి తేదీ జనవరి 24 అని తెలిపారు. పూర్తి పారదర్శకత, యాత్రికుల సౌకర్యార్థమే ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ ఏడు మరో 34, 500 పైగా మంది యాత్రికులు హజ్‌కు వెళ్తారని, చాలా ఏళ్ల తరువాత భారత హజ్ యాత్రికుల సంఖ్యలో ఇదే అతిపెద్ద పెరుగుదల అని వెల్లడించారు.