1న హజ్ యాత్రికులకు శిక్షణ తరగతులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాయలసీమలోని హజ్ యాత్రికులకు ఈనెల 1వ తేదీన కర్నూలులో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు రాయలసీమ హజ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు జె.అబ్దుల్ రహిమాన్ ఖాన్, ఎం.మొహమ్మద్పాషా (రాష్ట్ర హజ్‌కమిటీ మాజీ సభ్యుడు) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉల్మాయే ఇక్రామ్ల ద్వారా హజ్, ఉమ్రాలలో ఫరాయిజ్, వాజీబాత్ల గురించి క్షుణ్ణంగా తెలియజేస్తామన్నారు. శిక్షణ పొందాలుకునే హజ్ యాత్రికులు సోమవారం ఉదయం 9.30 గంటలకు బుధవారపేటలోని మెరీడియన్ ఫంక్షన్ హాల్‌కు హాజరు కావాలని కోరారు. యాత్రికులకు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.