halping
-
అమ్మ బతకాలని..
అమ్మ చేతి ముద్దలు తినాల్సిన ప్రాయం.. ఆ ఇద్దరు పిల్లలది. ఇప్పుడు అమ్మకి అన్నీ తామే అయ్యారు. చావుకు దగ్గరవుతున్న ఆమెను బతికించుకునేందుకు వారు పడుతున్న ఆరాటం చూసిన వారి గుండె తరుక్కుపోతోంది. తమ చదువును కూడా పక్కన పెట్టి తల్లి సేవకు అంకితమైన ఆ పిల్లలు దాతలు స్పందించాలని ప్రాధేయపడుతున్నారు. కొత్తవలస (శృంగవరపుకోట): ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన ఆలపాటి వెంకట సుబ్బారావు పొట్టకూటికి విశాఖపట్నం వలస వచ్చి ఊరూరా తిరుగుతూ అగరొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అరకుకు చెందిన వెంకటపద్మను 2004లో వివాహం చేసుకుని విజయనగరం జిల్లా కొత్తవలసలో స్థిరపడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2018లో వెంకటపద్మ రెండు కిడ్నీలు పాడైపోవటంతో సుబ్బారావు తనకున్న దాంట్లో మూడేళ్లుగా వైద్యం చేయిస్తూ అప్పుల పాలైపోయాడు. వ్యాపారం నడవక.. వయసు మీరటంతో పూట గడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఆమెకు మెరుగైన వైద్యం చేయించలేక సతమతమవుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ఇచ్చే రూ.10 వేల పింఛన్ ప్రస్తు తం వారిని ఆదుకుంటున్నా.. మందులకో సం దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. బడికి దూరమైన పిల్లలు తల్లి అనారోగ్యంతో మంచం పట్టడంతో ఆమెకు సేవలందించేందుకు వారికి ఉన్న ఇద్దరు పిల్లలు మూడేళ్లుగా బడికి దూరమయ్యారు. పరిస్థితి తెలుసుకున్న జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆర్థిక సాయం అందించారు. తల్లిదండ్రులను ఒప్పించి పెద్ద కొడుకు భరత్‌కుమార్‌కు పుస్తకాలు కొనిచ్చి చదివిస్తుండగా ప్రస్తుతం 9 తరగతికి వచ్చాడు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు ఇచ్చే కూర, రసంతో కాలం గడుపుతున్నారు. చిన్నకొడుకు వంశీ మాత్రం మూడోతరగతితో చదువు మానేసి తల్లి ఆలనా పాలనా చూస్తున్నాడు. నా పిల్లలు ఏమవుతారో.. నా రెండు కిడ్నీలు పోయాయి. నెలకు 12 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. చదువుకొని ఆడుకోéల్సిన నా ఇద్దరు పిల్లల్లో ఒకరు స్కూల్ మానేసి నాకు సేవలు అందిస్తున్నాడు. పెద్దకొడుకు ఇంటిపనులు చేస్తున్నాడు. నాపిల్లలు ఏమవుతారో తెలియడం లేదు. – ఆలపాటి వెంకట పద్మ వంట చేసి స్కూల్కెళ్తా.. ఉపాధ్యాయులు ఇచ్చిన ధైర్యంతో పాఠశాలకు వెళుతున్నాను. మా అమ్మ పరిస్థితి చూసి కొంత ఆర్థిక సాయం చేశారు. స్కూల్‌కు వెళ్లేముందు బొగ్గుల కుంపటిపై అన్నం వండి తమ్ముడికి అప్పగించి వెళ్తున్నా.. – భరత్‌కుమార్, పెద్ద కుమారుడు అందుకే బడికెళ్లడం మానేశా.. అమ్మకు రెండు కిడ్నీలు పోవటంతో ఏం చేయాలో తెలియడం లేదు. తలచుకుంటేనే ఏడుపు వస్తోంది. అమ్మకి సేవలు చేసేందుకు మాకు ఎవరూ లేరు. అందుకే నేను బడికి వెళ్లటం మానేశాను. – వంశీ, చిన్న కుమారుడు నైతిక విలువలున్న కుటుంబం కన్నతల్లికి రెండు కిడ్నీలు పాడవటంతో చూసుకోవడానికి రెండో కొడుకు పాఠశాలకు రావటం మానేశాడు. విషయం తెలుసుకుని తోటి ఉపాధ్యాయులంతా కొంత మొత్తం వేసుకుని కుటుంబానికి సాయం చేశాం. నైతిక విలువలున్న కుటుంబం వారిది. – కృష్ణవేణి, విశ్రాంత ఉపాధ్యాయిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ స్పందించే దాతలు 90529 81811 ఫోన్‌నంబర్‌కు ఫోన్ చేసి సాయం అందించాలని ఆ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. -
మమ్మల్ని ఆదుకోరూ..
సుజాతనగర్: కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు... ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేశాడు.. కాని విధి వక్రీకరించి ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడ్డాడు. కుటుంబ బాధ్యత నెత్తికెత్తుకున్న మరో కూతురు విద్యుదాఘాతంతో మృతి చెందింది. కూతురిని కాపాడబోయి తల్లి కూడా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఒక చేయి పనిచేయడం లేదు. కుటుంబ పోషణే భారమైన తరుణంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారీ నిరుపేద దంపతులు సుజాతనగర్ మండలం సింగభూపాలేనికి చెందిన ఉగ్గం వెంకటేశ్వర్లు, భార్య సత్యవతికి ముగ్గురు కూతుళ్లు. కూలీనాలి చేసుకోవడంతోపాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం అనారోగ్యం పాలయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు అప్పోసప్పో చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఒక కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడంతో ఆర్థికస్థోమత అంతంతమాత్రంగా ఉన్న వెంకటేశ్వర్లు మెరుగైన వైద్యం చేయించుకోలేకపోయాడు. దీంతో రెండో కిడ్నీసైతం చెడిపోయింది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు మంచానికే పరిమితమై తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకరి ఊతం లేనిదే మంచం పైనుంచి లెగిసే పరిస్థితి లేదు. తల్లిదండ్రుల బాధ చూడలేని పెద్దకూతురు అరుణ ఇంటి బాధ్యతను స్వీకరించి తాను కూడా కూలీకి వెళ్తూ, కాయగూరలు అమ్ముతూ బతుకుబండిని నెట్టుకొస్తుండేది. విధి వక్రించి ఇంటి పనులు చేసుకుంటున్న తరుణంలో అరుణ ఇంట్లోనే విద్యుదాఘాతానికి గురైంది. కూతురిని రక్షించే క్రమంలో తల్లి సత్యవతి కూడా విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో అరుణ అక్కడికక్కడే మరణించగా, సత్యవతికి కుడిచేయి సరిగ్గా పనిచేయని స్థితికి చేరుకోవడంతోపాటు కాలి వేళ్లు కూడా తెగిపోయాయి. సంవత్సర కాలం నుంచి జీవనం సాగించడానికి ఆ దంపతులిద్దరూ పడే వేదన వర్ణణాతీతం. పూట గడవడమే కష్టంగా ఉన్న దంపతులకు అనారోగ్యం మరింత కుంగదీస్తోంది. కూలీపనులు సైతం చేసుకునే పరిస్థితిలో లేని సత్యవతి చుట్టుపక్కలవారి సాయంతో రోజులు నెట్టుకొస్తోంది. మెరుగైన వైద్యానికి డబ్బులు లేకపోవడంతో భర్త ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండటంతో కన్నీటిపర్యంతమవుతోంది. ఉండటానికి కనీసం సరైన ఇళ్లు కూడా లేక పూరిగుడిసెలోనే జీవనం సాగిస్తున్నారు. తన భర్తకు మెరుగైన వైద్యం అందితే కుటుంబ పోషణ బాగుంటుందని భార్య సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాతలు ఉంటే సాయం చేయాలంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. -
తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : నెల రోజుల్లో ఆవిర్భావం కానున్న ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రాణాలు బలిదానం చేసిన అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్ప ష్టం చేశారు. ఆదివారం మంచిర్యాలలోని నిర్మాణ రంగ భవనంలో ఏర్పాటు చేసిన ‘అమరుల తల్లుల కడుపుకోత సదస్సు’కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదట అమరవీరు ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ, కొంత మంది సీమాంధ్ర నాయకులు రక్షణ కల్పించాలని కేంద్రానికి చేస్తున్న విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రులు వత్తాసు పలుకుతున్నారని అలాంటి హామీలు చేస్తే సహించేది లేదని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతున్న తరుణంలో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అమరుల కుటుంబాలను ఆదుకునేలా వారికి అండగా నిలిచేలా ఫైల్‌పై మొదటి సంతకం చేయాలని తెలి పారు. నెక్లెస్ రోడ్ లో ప్రపంచ స్థాయిలోనే ప్రత్యేక సందర్శన స్థలంగా తీర్చిదిద్దే లా భారీ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇక అమరవీరులకు సంబంధించిన ఆయా గ్రామాల్లో అమరవీరుల భవనాన్ని ఏర్పాటు చేసి అం దులో అమరుల చరితను భావితరాలకు తెలిపేలా గ్రంథాల యాల్లో పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచిం చారు. దీంతోపాటు అమరవీరుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల సాగు భూమి, తల్లిదండ్రులకు నెలకు రూ.5 వేల పింఛన్, కుటుం బంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ సౌకర్యం కలిపించాలని డి మాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలి చేలా నవంబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో తలపెట్టిన తెలంగాణ అమరవీరుల తల్లుల కడుపుకోత మహాసభకు అమరవీ రుల కుటుంబాల సభ్యులు తెలంగాణవాదులు, యువతీ, యువకులు భారీ సం ఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎమ్మార్పీఎస్ నాయకులు రేగుంట సునీల్, దశరథం, కలమడుగు సత్తయ్య, మోతె పోచయ్య, నక్క అంజయ్య, నరేశ్‌మాదిగ పాల్గొన్నారు.