తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి
Published Mon, Oct 21 2013 2:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : నెల రోజుల్లో ఆవిర్భావం కానున్న ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రాణాలు బలిదానం చేసిన అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్ప ష్టం చేశారు. ఆదివారం మంచిర్యాలలోని నిర్మాణ రంగ భవనంలో ఏర్పాటు చేసిన ‘అమరుల తల్లుల కడుపుకోత సదస్సు’కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదట అమరవీరు ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ, కొంత మంది సీమాంధ్ర నాయకులు రక్షణ కల్పించాలని కేంద్రానికి చేస్తున్న విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రులు వత్తాసు పలుకుతున్నారని అలాంటి హామీలు చేస్తే సహించేది లేదని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతున్న తరుణంలో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అమరుల కుటుంబాలను ఆదుకునేలా వారికి అండగా నిలిచేలా ఫైల్‌పై మొదటి సంతకం చేయాలని తెలి పారు. నెక్లెస్ రోడ్ లో ప్రపంచ స్థాయిలోనే ప్రత్యేక సందర్శన స్థలంగా తీర్చిదిద్దే లా భారీ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇక అమరవీరులకు సంబంధించిన ఆయా గ్రామాల్లో అమరవీరుల భవనాన్ని ఏర్పాటు చేసి అం దులో అమరుల చరితను భావితరాలకు తెలిపేలా గ్రంథాల యాల్లో పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచిం చారు.
దీంతోపాటు అమరవీరుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల సాగు భూమి, తల్లిదండ్రులకు నెలకు రూ.5 వేల పింఛన్, కుటుం బంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ సౌకర్యం కలిపించాలని డి మాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలి చేలా నవంబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో తలపెట్టిన తెలంగాణ అమరవీరుల తల్లుల కడుపుకోత మహాసభకు అమరవీ రుల కుటుంబాల సభ్యులు తెలంగాణవాదులు, యువతీ, యువకులు భారీ సం ఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎమ్మార్పీఎస్ నాయకులు రేగుంట సునీల్, దశరథం, కలమడుగు సత్తయ్య, మోతె పోచయ్య, నక్క అంజయ్య, నరేశ్‌మాదిగ పాల్గొన్నారు.
Advertisement