ఘోర రోడ్డు ప్రమాదం
హమిర్పూర్: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటుచేసుకుంది. గురువారం ఉదయం మోధ ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు లారీలు ఎక్కువ వేగంతో వెళ్తూ ఢీకొనడంతో అవిపూర్తిగా ధ్వంసమయ్యాయి.