hampi temple
-
హంపీ సౌందర్యం అద్భుతం
సాక్షి, బళ్లారి : హంపిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సతీమణి కాంచన గడ్కరి సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె జిందాల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత బళ్లారి లోక్‌సభ మాజీ సభ్యురాలు జె.శాంతతో కలిసి హంపీకి వెళ్లి విరుపాక్షేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పలు పర్యాటక స్థలాలను సందర్శించారు. తర్వాత అంజనాద్రి బెట్టలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఈసందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మహిమాన్వితుడైన శ్రీవిరుపాక్షేశ్వర స్వామిని, అంజనాద్రి కొండను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హంపి శిల్పకళ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, అంజనాద్రి కొండ, హంపి పక్కపక్కనే ఉండటం ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా విరాజిల్లేందుకు దోహదం చేశాయని, ఈ రెండు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు విచ్చేసినట్లు పేర్కొన్నారు. -
ఆలయంలో మద్యం సీసాలతో ఫారిన్ జంట
హంపీ: హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆలయంలో ఓ విదేశీ పర్యాటకుడు మద్యం సీసాతో ప్రవేశించడం కలకలం రేపింది. ఒక్కసారిగా ఆలయం మొత్తం ఉద్రిక్త పరిస్థితిని నెలకొల్పింది. ప్రవేశ ద్వారం వద్దే అతడిని అడ్డుకొని వెనక్కి పంపించినా ఖాతరు చేయకుండా మళ్లీ ప్రవేశించడంతో పలువురు ఆలయ ధర్మకర్తలకు, కార్యకర్తలకు, భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అతడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన హంపీలోని విరుపాక్ష ఆలయంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గుర్తు తెలియని ఆ టూరిస్టు హాలండ్ ప్రాంతానికి చెందినవాడని అంటున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయ ప్రాంగణంలో, ఆవరణంలో మద్యపానంపై నిషేధం ఉంది. అలాంటిది అతడు మాత్రం ఏకంగా ఆలయం లోపలికి మద్యంతో అడుగుపెట్టాడు. తొలుత మేం చెప్పగానే అతడు తన పార్టనర్‌తో కలిసి బయటకు వెళ్లినప్పటికీ ఐదు నిమిషాల తర్వాత వెనక్కు వచ్చారు. అయితే, ఎవరికీ కనిపించకుండా అతడి దుస్తుల వెనుక దాచుకొని మళ్లీ తెచ్చుకున్నాడు. దీంతో గట్టి వార్నింగ్ ఇచ్చి వెనక్కి పంపించాం’ అని సేవ్ హంపీ ఉద్యమకారుడు రచ్చయ్య తెలిపారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని, ఆ టూరిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనకు దిగారు. ప్రస్తుతానికి పోలీసులు ఆ టూరిస్టుకోసం ప్రయత్నిస్తున్నారు. -
డిజిటల్ రూపంలో హంపీ దేవాలయం
న్యూఢిల్లీ: కర్ణాటకలోని యునెస్కో గుర్తిం చిన ప్రపంచ వారసత్వ కట్టడం హంపీ దేవాలయాన్ని ఇకపై మొబైల్ఫోన్లో డిజిటల్ రూ పంలోనూ దర్శించుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ శిథిలమైన విఠల దేవాల యాన్ని కూడా పూర్వపు స్థితిలో చూడవచ్చు. హంపీ దేవాలయాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేలా 3డీ చిత్రాలతో డిజి టల్ రూపంలో ఆవిష్కరించినట్లు ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ శంతను చౌదరీ వెల్లడించారు. ఐఐటీలు, ఇతర సంస్థల సాంకేతిక సహకారంతో దీనిని రూపొం దించినట్లు తెలి పారు. మంగళవారం ప్రారంభం కానున్న రెండు రోజుల ‘ఇండియా హ్యాబిటాట్ సెంటర్’ ఎగ్జిబిషన్లో కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరీ ఈ ‘డిజి టల్ హంపీ’ని ఆవి ష్కరిస్తారని పేర్కొన్నారు.