ట్యాంక్‌బండ్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
రాంగోపాల్‌పేట్: కుటుంబ కలహాలతో ఓ మహిళ హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నించగా లేక్ పోలీసులు రక్షించారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. జీరా ఇందిరానగర్‌కాలనీకి చెందిన హంసమ్మ(36) బాలేష్‌లు భార్యాభర్తలు. వీరికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల నుంచి భర్త రోజు మద్యం సేవించి భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
ఆదివారం ఉదయం కూడా మద్యం సేవించి వచ్చిన బాలేష్ భార్యను తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురై ట్యాంక్‌బండ్‌పై ఉన్న లేపాక్షి భవనం వద్దకు వచ్చి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.