Hand Watches
-
‘వాచ్’ దిస్ ట్రెండ్ : కాలం కలిసొస్తోంది
బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చేతికి ఒకసారి సుమారు 4.75 కోట్ల విలువ చేసే నీలంరంగు ఆడెమర్స్ పిగ్యూట్ వాచ్‌తో మెరిపించాడు. కోట్ల నుంచి ఐదు లక్షల విలువ చేసే టగ్ హెయర్ వరకు ఏడెనిమిది వాచ్‌లతో కనిపిస్తాడు ఎస్ఆర్కే. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే నాలుగు కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె ఎఫ్ 1లో టైమ్ చూసుకుంటాడు. రామ్‌చరణ్ దగ్గర మూడు కోట్ల విలువ చేసే రిచర్డ్ మిల్లె నుంచి ఆరు లక్షల విలువ చేసే రోలెక్స్ యాచ్ మాస్టర్ వరకు అరడజనుకు పైగా వాచ్లున్నట్లు సమాచారం. ఇక నటీమణుల విషయానికి వస్తే నయనతార కోటికి పైగా ధర పలికే రిచర్డ్ మిల్లె ఆర్ ఎమ్ 11 వాచ్‌తో కాలాన్ని వాచ్ చేస్తుంది.స్మార్ట్ ఫోన్ వచ్చినా రిస్ట్ వాచ్లకు ‘కాలం’ చెల్లలేదు. నిజమే, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రిస్ట్ వాచ్లకు కాలం చెల్లిందనిపించింది. ఓ దశాబ్దం పాటు వాచీల మార్కెట్ డీలా పడిన మాట కూడా నిజమే. అయితే ఆ రోజుల్లో కూడా సెలబ్రిటీలు, సంపన్నులు, తరచూ విదేశీ టూర్లు చేసే వాళ్లు లక్షల ఖరీదు చేసి వాచ్‌లు పెట్టుకోవడం మాత్రం కొనసాగింది. మన సినీ సెలబ్రిటీలైతే రిచర్డ్ మిల్లె, టగ్ హెయర్, హబ్లాట్, ఫ్రాంక్ ముల్లర్, ఆడెమర్స్ పిగ్యూట్, రాడో, పటేక్ ఫిలిప్పె, ఓమెగా, రోలెక్స్ నుంచి ఐడబ్ల్యూసీ వరకు ఐదు కోట్ల విలువ చేసే వాచ్‌ల నుంచి ఐదు లక్షల రూ΄ాయల వాచ్‌లు వాడుతున్నారు. ఈ ట్రెండ్ సెలబ్రిటీల దగ్గరే ఆగి΄ోకుండా గడచిన రెండేళ్లుగా కామన్ మ్యాన్ వరకు విస్తరించింది. ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి కూడా యాభై వేల నుంచి లక్షల రూ΄ాయల రిస్ట్ వాచ్‌లు కొనుగోలు చేస్తోంది. ప్రపంచ గడియారాల తయారీ కేంద్రం స్విట్జర్లాండ్ నుంచి మనదేశానికి దిగుమతి అవుతోన్న వాచ్‌ల సంఖ్య ఏడాదకేడాదికీ పెరుగుతోంది. 2026 నాటికి స్విస్ నుంచి వాచ్‌లు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ టాప్‌టెన్‌లో ఉంటుందని చెబుతున్నారు ఆ దేశ మార్కెట్ నిపుణులు. ఉంగరంలా మనదేశంలో 40 ఏళ్లుగా వేళ్లూనుకుని ఉన్న టైటాన్‌తో΄ాటు దాదాపు 30 కంపెనీలున్నాయి. వీటి మార్కెట్ వీటికి ఉంది. మనదేశీయ కంపెనీలు వందల నుంచి లక్షల విలువ చేసే గోల్డ్ వాచ్‌లు కూడా తయారు చేస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సంపన్న మహిళలు బంగారు వాచ్ ధరించి మురిసి΄ోయేవాళ్లు. ఇప్పుడు రోలెక్స్, రాడో కపుల్ వాచ్‌లు, రోజ్‌గోల్డ్ మీద మనసు పడుతున్నారు. యూఎస్‌కి చెందిన ఫాజిల్ కంపెనీ మహిళల కోసం తయారు చేస్తున్న రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వాచ్‌ల మీద మనసు పారేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇండియా నుంచి యూఎస్‌కి మైగ్రేషన్ ఎక్కువ కావడమే. యూఎస్‌లో సెటిలైన యువత వాళ్ల తల్లులకు ఈ వాచ్‌లను బహుమతిగా ఇస్తున్నారు. దాంతో వేడుకల్లో మహిళల మణికట్టుకు రోజ్‌గోల్డ్ వాచ్ మెరుస్తోంది. మొత్తానికి మనదేశంలో వాచ్‌ల ప్రేమికులు ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వాచ్‌లు కొంటున్నారు. యువతులు మాత్రం వాచ్ అంటే మణికట్టుకే ఎందుకు పెట్టుకోవాలంటూ వేలికి ఉంగరంలా ధరించే వాచ్లకు మొగ్గుచూపుతున్నారు.– వి.ఎమ్.ఆర్. -
అదిరిపోయే ఫీచర్లతో.. వారి కోసం ప్రత్యేక స్మార్ట్ వాచ్!
అంధుల కోసం ఓ ప్రత్యేక స్మార్ట్ వాచ్(Smart Watch)ను తయారు చేశారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆధునిక టెక్నాలజీతో ఓ స్మార్ట్ వాచ్‌ను కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. వీటిని పెద్ద మొత్తంలో తయారీతో పాటు విక్రయించేందుకు యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఐఐటీ కాన్పూర్ జతకట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లలో లోపాలను సరిచేసి యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు హాప్టిక్ వాచ్‌ను రూపొందించినట్లు ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో టాక్టిల్, టాకింగ్, వైబ్రేషన్, బ్రెయిలీ ఆధారిత వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమిస్తూ ఈ స్మార్ట్ వాచ్ రాబోతోంది. యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి త్వరలో ఈ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేయనున్నట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరందికర్ తెలిపారు. ఇందులో ఏ ఫీచర్లు ఉన్నాయంటే! ఈ హాప్టిక్ స్మార్ట్ వాచ్ రెండు వేరియంట్లలో రానుంది. ఇందులో డయల్ఫ్రీ ఆప్షన్‌తోపాటు 12 టచ్-సెన్సిటివ్ హవర్ మార్కర్స్ ఉంటాయి. వాచ్‌ను ధరించిన వారు ఈ మార్కర్స్పై ఫింగర్‌ను స్కాన్ చేయడం ద్వారా టైమ్ తెలుసుకోవచ్చు. ఈ వాచ్.. టాక్టిల్, వైబ్రేషన్ వాచ్‌ల సమ్మిళతంగా ఉంటుంది. అయితే వైబ్రేషన్ వాచ్‌లలో 20పైగా ఉండే వైబ్రేషన్ పల్సెస్‌ను ఈ వాచ్‌లో 2 పల్సెస్‌కు తగ్గించారు. టాక్టిల్ వాచ్‌కు ఉండే సులువుగా విరిగిపోయే స్వభావం ఇందులో ఉండదు. వీటితోపాటు హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, హైడ్రేషన్ రిమైండర్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంధుల కోసం ప్రస్తుతం ఉన్న స్మార్ట్ వాచ్‌లు ఆడియో ఆధారిత అవుట్‌పుట్‌తో పనిచేసేవి కావడం వల్ల వాటిని ధరించిన వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది లేకుండా ఐఐటీ కాన్పూర్ ఈ హాప్టిక్ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మార్పులు రానున్నాయ్, నిమిషానికి 2 లక్షల టికెట్లు! -
భయం
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 26 మిస్టర్ వెల్డన్ గొప్ప దొంగ. అతనిలోని ఏకైక లోపం భయం. ఐతే అతనిలో ఊహా శక్తి అధికం కాబట్టి భయమూ అధికమే. ఊహాశక్తి లేకపోతే గొప్ప దొంగ అవడం కష్టం. తన భయాన్ని చుట్టుపక్కలవారు గమనిస్తున్నారేమో అని వెల్డన్‌లో ఇంకో అనుబంధ భయం కూడా ఉంది. వీటికి తోడు అతనికి చచ్చేంత మొహమాటం. ఆరోజు వెల్డన్ ఓ దుకాణంలోని వస్తువుల్ని దొంగిలించడానికి వెళ్లాడు. ముర్రేస్ మెన్స్ స్టోర్‌లో అమ్మేవన్నీ విలువైనవే కాబట్టి లోపలికి వెళ్లాడు. ఖరీదైన చేతి గడియారాలు అతని దృష్టిని ఆకర్షించాయి. దేని ధరా వెయ్యి డాలర్లకి తక్కువ లేదు. ఓ ర్యాక్ నించి మూడు డజన్ల గడియారాలు వేలాడున్నాయి. వాటిని పరిశీలిస్తున్నట్లు నటిస్తూండగా మూడో గడియారం లాఘవంగా అతని మోచేతి పైకి వెళ్ళిపోయింది. చుట్టూ చూశాడు. టై విభాగంలోని ఆ సేల్స్‌మేన్ తన వంకే చూస్తున్నాడా? అతను తనవైపే చూస్తున్నా అతని దృష్టి తన తలమీద కొద్దిగా పైకిఉందని గుర్తించాడు. నాలుగో వాచీ కూడా మూడో వాచీ పక్కన అతని చేతిలోకి చేరింది. ఇంక వెళ్దామనుకుంటుండగా ఆ టై సేల్స్‌మేన్ తనవైపు వస్తున్నాడని గ్రహించాడు. వాటిని తిరిగి యథాస్థానంలో ఉంచుదామని అను కుంటూండగా ఆ సేల్స్ మేన్ మొహంలో చిరు నవ్వు మొలిచింది. అది కస్టమర్‌ని గ్రీట్ చేసే నవ్వుగా గ్రహించి స్థిమిత పడ్డాడు. ‘‘ఐ బెగ్ యువర్ పార్డన్ సార్. మీరు దేని కోసం చూస్తున్నారో అది కనిపించిందా?’’ అతని ప్రశ్న ఇది. ‘‘లేదు. షర్ట్‌లని చూద్దామని వచ్చా.’’ నిజానికి ‘లేదు’ దగ్గర మాట్లాడటం ఆపేసి బయటికి నడవాలి. కాని భయంతో తనకి తెలీకుండానే ఆ రెండో వాక్యం మాట్లాడాడు. ‘‘ఎక్స్లెంట్ సార్. ఇటు రండి.’’ వాల్డన్కి అతని వెంట నడవక తప్పలేదు. ‘‘మీ సైజు తెలుసా? లేదా మీ స్లీవ్, కాలర్లని కొలవనా? దయచేసి మీ కుడి చేతిని చాపుతారా?’’ అతను జేబులోంచి టేప్ తీశాడు. ‘‘ఆ అవసరం లేదు. అది ముప్ఫై మూడు. కాలర్ సైజ్ పదిహేను’’ వాల్డన్ వెంటనే చెప్పాడు. ‘‘ఐదు డాలర్లవి రెండు ఇవ్వండి.’’ ‘‘మీరు డజను పెట్టెని కొంటే దాని ధర యాభై డాలర్లే. అంటే మీకు రెండు షర్ట్లు ఉచితంగా వచ్చినట్లు. మెటీరియల్ చూడండి’’ అతను వెల్డన్ చేతిని అందుకుని ఓ షర్ట్ మీదకి తీసుకెళ్లాడు. ‘‘సరే’’ తన వాచీ ఉన్న చేతిని లాక్కుంటూ వెల్డన్ చెప్పాడు. డబ్బు చెల్లించి రసీదు తీసుకుని వెళ్లడానికి వెనక్కి తిరిగాడు. అప్పటికే నుదుటికి పట్టిన చెమటని రుమాలుతో రెండుసార్లు తుడుచు కున్నాడు వెల్డన్. ఆ సేల్స్‌మేన్ కౌంటర్ నించి వెల్డన్ ముందుకి వచ్చి నిలబడి చేతిని అడ్డుపెట్టి ఆపాడు. ‘‘మీరు మా కొత్త టైలు చూడకుండా మిమ్మల్ని వెళ్లనివ్వను. షర్ట్ కొన్నప్పుడే టైలని కొనాలి కదా సర్’’ అతను వెల్డన్ చేతిని పట్టుకుని టైల కౌంటర్ దగ్గరికి తీసు కెళ్లాడు. వెల్డన్ అతని చేతిని సాధ్యమైనంత మృదువుగా విడిపించుకున్నాడు. సేల్స్‌మేన్ చేతిలో ఓ డజను టైలు ప్రత్యక్షం అయ్యాయి. ‘‘ఇది చూశారా? గ్రే. మీరు కొన్న షర్ట్‌కి సూట్ అవుతుంది. ఇది బ్లూ. ఇది రెండు షర్ట్లకి సూట్ అవు తుంది. డజను పెట్టె పాతిక డాలర్లు. ప్లస్ ట్యాక్స్ సర్. కాని కొత్త షర్ట్ వేసుకున్నప్పు డల్లా మీ పాత టైలలో ఏది మేచింగ్ అని వెదికే శ్రమ తప్పుతుంది. అవునా సర్?’’ ‘‘అవును. ఇవీ తీసుకుంటాను.’’ మళ్లీ ఇద్దరూ కౌంటర్ దగ్గరికి వెళ్లారు. బిల్ చెల్లించి రసీదు తీసుకున్నాడు. వెల్డన్ తలుపు వైపు నడుస్తుండగా సేల్స్‌మేన్ అరుపు వినిపించింది. ‘‘ఆగండి.’’ తల తిప్పి చూశాడు. అతను తనని ఉద్దేశించే ఆ మాట అన్నాడని గ్రహించ గానే వణుకు పుట్టింది. అతను వెల్డన్ దగ్గరికి వచ్చి కుడి చేతి వేలుని హెచ్చరికగా ఊపాడు. ‘‘మీరు బయటికి వెళ్లడానికి వీల్లేదు. కాసేపు ఆగాలి.’’ ‘‘దేనికి?’’ తడారిన గొంతుతో వినపడీ వినపడనట్లు వెల్డన్ ప్రశ్నించాడు. ‘‘బూట్లు సార్. మీరు బూట్లు కొన కుండా వెళ్లకూడదు. రండి.’’ వెల్డన్ తన చెయ్యి అతని చేతికి అందకుండా వెనక దాచి అతని పక్కనే నడుస్తూ చెప్పాడు. ‘‘చూద్దాం పద.’’ వెల్డన్ మొసలి చర్మం బూట్లని, ఇంట్లో వేసుకునే చెప్పులని, ఎన్నడూ టెన్నిస్ ఆడకపోయినా టెన్నిస్ షూస్‌ని కొన్నాడు. తను మెయిన్ డోర్‌కి మూడు కౌంటర్ల దూరంలో ఉన్నాడని వెల్డన్ గుర్తించాడు. ఐతే ప్రతి కౌంటర్లో సేల్స్‌మేన్ వెల్డన్ని ఆపి సాక్స్, టై పిన్స్ కొనిపించాడు. తను లెదర్ వస్తువులు ఏమీ వాడనని, తను బుద్ధిజాన్ని తీసుకున్నానని, హింస జరిగితే కాని జంతువుల నించి తోలు రాదు కాబట్టి అవి తమకి నిషిద్ధం అని లామా చెప్పాడని అప్పటికప్పుడు అబద్ధాన్ని ఆడాడు. ‘‘ఇవాళ వేడిగా ఉంది’’... చెమటని తుడుచుకుంటూ చెప్పాడు. తన చేతి నించి ఆ వాచీల టిక్‌టిక్ బయటికి వినిపిస్తోందా అనే కొత్త భయం కలిగింది. సాక్స్‌కి, టై పిన్స్కి డబ్బు చెల్లించి మెయిన్ డోర్ దగ్గరికి చేరుకునేసరికి సేల్స్‌మేన్ కనిపించాడు - చేతిలో స్కార్ఫ్‌తో. ‘‘అన్నీ మీకు కొనుక్కున్నారు. మీ ఆవిడకి ఏమైనా కొనుక్కెళ్తే సంతోషిస్తుంది.’’ ‘‘లేదు. లేదు. నేను తొందర పనిమీద ఉన్నాను, వెళ్లాలి’’ వెల్డన్ అభ్యంతరం చెప్పాడు. సేల్స్‌మేన్ తలని విచారంగా అడ్డంగా ఊపాడు. ‘‘మీ విషయంలో ఇక నేను నిర్దయగా ఉంటాను.’’ ‘‘ఏమిటి?’’ ఉలిక్కిపడ్డాడు. ‘‘ముర్రేస్ మెన్స్ స్టోర్ నుంచి కేవలం భార్యల కోసం ఉంచిన ఏకైక వస్తువైన సిల్క్ స్కార్ఫ్‌ని కొనుక్కెళ్లకుండా ఇంటికి వెళ్లడం నిర్దయ సార్. నా సలహా విని రెండు స్కార్ఫ్లని కొనండి. ఒక్కోటీ పదిహేను డాలర్లే. రెండూ పాతిక డాలర్లు. ఐదు డాలర్లని ఆదా చేయొచ్చు.’’ ‘‘లేదు’’... వెల్టన్ చేతిలోని ప్యాకెట్లు కింద పడ్డాయి. ఒంగి తీసుకోబోతూంటే సేల్స్‌మేన్ అతని కుడి చేతిని పట్టుకుని ఆపి చెప్పాడు. ‘‘నేనుండగానా సార్. నా మాట విని వీటిని తీసుకుని పాతిక డాలర్లు ఇవ్వండి. మీకు టైం ఉంది సార్’’ ఆఖరి వాక్యాన్ని నెమ్మదిగా, హెచ్చరిస్తున్న కంఠంతో చెప్పాడు. ‘‘ఏ... ఏమిటి?’’ ‘‘టైం సార్. మీ దగ్గర చేతి గడియారం ఉందా సార్?’’ ‘‘గడియారమా? లేదు. నా దగ్గర గడియారం లేదు. అది చాలా చక్కటి స్కార్ఫ్. రెండూ బావున్నాయి. ఇంద పాతిక.’’ ‘‘ఆఖరి కొనుగోలు సార్ ఇది. చేతి రుమాళ్లు. మగవాళ్లవే. డజను పది డాలర్లే.’’ వాటినీ కొని వెల్డన్ షాప్‌లోంచి బయటికి వస్తుండగా సేల్స్‌మేన్ చెప్పాడు. ‘‘సర్. మిమ్మల్ని టైం ఎందుకు అడిగానో తెలుసా? క్లోజింగ్ టైమ్‌లో ఏ సేల్స్‌మేన్ ఆఖరి అమ్మకాన్ని చేస్తాడో అతనికి ఐదు వందల డాలర్ల బోనస్‌ని ఇస్తూంటారు.’’ అకస్మాత్తుగా ఓ చెయ్యి తన కుడి చేతిని పట్టుకోవడం, షర్ట్ స్లీవ్ని పైకి ఎత్తి ఆ వాచీలని చూడటం, వెంటనే తన రెండు చేతులకీ బేడీలు పడటం వెల్డన్కి అర్థం అయ్యే లోపలే జరిగి పోయాయి. ఆ సేల్స్‌మేన్ బాధగా నవ్వుతూ కనిపించాడు. ‘‘సారీ సార్. మీ అంత మంచి కస్టమర్‌ని అరెస్ట్ చేయడాన్ని చూడటం నాకు బాధగా ఉంది’’ చెప్పాడు. (చార్లెస్ మేకిన్‌తోష్ కథకి స్వేచ్ఛానువాదం)