టూ ఇన్ వన్...
ఒక్కోసారి అనుకోకుండా కూరగాయలకు వెళ్లాల్సి వస్తుంది. చేతిలో కవర్, సంచిలాంటివి ఏమీ ఉండవు. మరేంటి దారి? కొన్ని మార్కెట్లలో అయితే క్యారీ బ్యాగ్స్ అమ్ముతారు. అలా ప్రతి చోటా దొరుకుతాయని గ్యారంటీ లేదు. ‘అబ్బా.. బ్యాగ్‌లో ఓ కవర్ పెట్టుకుంటే బాగుండేదే’ అనుకుంటాం. అలాంటి సమస్యలు ఇంకోసారి మీ చెంతకు రావద్దంటే.. ఈ ‘హ్యాండీ బ్యాగ్’ ఎప్పుడూ మీ కీ చెయిన్‌కు తప్పక ఉండాల్సిందే.
‘కీ చెయిన్’కు ‘క్యారీ బ్యాగ్’కు సంబంధం ఏంటనుకుంటున్నారా? అయితే ఓసారి పక్కనున్న ఫొటోను చూడండి. అవసరం లేనప్పుడు బ్యాగ్‌ను చిన్నగా ఫోల్డ్ చేసి కీ చెయిన్‌లా వాడుకోవచ్చు. బ్యాగ్ అవసరమైనప్పుడు దాన్ని విప్పితే సరి.. ఇది ఎయిర్ టైట్, వాటర్ ప్రూఫ్ బ్యాగ్.