చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం సిద్ధివారిపాలెం సమీపంలో చోటు చేసుకుంది. చెట్టుకు వెలాడుతున్న జంట మృతదేహలను చూసి స్థానికులు గురువారం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... మృతదేహలను చెట్టుపై నుంచి కిందకి దించారు. అయితే ప్రేమ జంట మృతదేహలు అప్పటికే కుళ్లిపోయినాయి. దాంతో ఆ మృతదేహలను పోలీసులు స్వాదీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ జంట వివరాల కోసం పోలీసులు స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.